అత్తమామల రాక్షసానందం.. కోడలు ఉరివేసుకుంటుంటే.. వీడియో
In-laws shoot video of woman's suicide.మనస్తాపం చెందిన కోడలు ఉరివేసుకుంటుంటే.. అత్తమామలు రక్షించాల్సింది పోయి కిటికీలోంచి వీడియో తీసి రాక్షసానందం పొందారు.
By తోట వంశీ కుమార్ Published on 14 April 2021 1:05 PM ISTప్రస్తుత సమాజంలో మానవత్వం మంటగలిసి పోతుంది. తమ కన్నుల ముందే ఓ మనిషి ప్రాణం తీసుకుంటుంటే ఆపాల్సింది పోయి.. ఎంచక్కా వీడియోలు తీసుకుంటున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. మనస్తాపం చెందిన కోడలు ఉరివేసుకుంటుంటే.. అత్తమామలు రక్షించాల్సింది పోయి కిటికీలోంచి వీడియో తీసి రాక్షసానందం పొందారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళితే.. కోమల్ అనే మహిళకు ఆశిష్ తో 2019లో వివాహం జరిగింది. వివాహ సమయంలో కట్నం కింద రూ.5లక్షల నగదుతో పాటు ఓ బైక్‌ని ఇచ్చారు. కోమల్ తన భర్త ఆశిష్.. అత్తమామలతో కలిసి డాటియానా గ్రామంలో నివసిస్తోంది. కొంత కాలం పాటు వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగింది. అయితే.. గత ఆరు నెలలుగా ఆశిష్ తల్లిదండ్రులు అదనపు కట్నం కోసం కోమల్ వేదిస్తున్నారు. భర్తకు తన బాధ చెప్పుకున్నా అతడు కూడా వారికే వత్తాసు పలికాడు. దీనికి తోడు అత్తమామల వేదింపులు అధికం కావడంతో ఇటీవల కోమల్ తన పుట్టింటికి వచ్చింది. ఆ ఊరి పెద్దలు నచ్చజెప్పడంతో ఇటీవల తిరిగి తన అత్తవారింటికి వచ్చింది. అయితే అత్తమామలు మళ్లీ తనని వేధించడం మొదలు పెట్టారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొంది. ఆదివారం ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
అయితే.. కోమల్ ఉరి వేసుకుంటున్న సమయంలో ఆమెను ఆపాల్సిన అత్త మామలు వీడియో తీస్తూ ఉన్నారు. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉరి వేసుకునేందుకు దుపట్టా కట్టిన కోమల్ అది గట్టిగా ఉన్నదా.. లేదా అని లాగి చూస్తోంది. ఆమెకు ఆమె ఉరివేసుకుంటుంది అని అరవడం ఆ వీడియోలో స్పష్టంగా వినిపిస్తోంది. దీనిపై కోమల్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.