ఐఐటీ హైద‌రాబాద్ విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌

IIT Hyderabad student commits suicide in Sangareddy.హైద‌రాబాద్ ఐఐటీకి చెందిన విద్యార్థుల వ‌రుస ఆత్మ‌హ‌త్య‌లు క‌ల‌క‌లం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Sept 2022 12:23 PM IST
ఐఐటీ హైద‌రాబాద్ విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌

హైద‌రాబాద్ ఐఐటీకి చెందిన విద్యార్థుల వ‌రుస ఆత్మ‌హ‌త్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో మ‌రో విద్యార్థి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు. రాజ‌స్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్‌కు చెందిన మెగా క‌పూర్ ఐఐటీలో బీటెక్‌ కెమికల్‌ ఇంజినీరింగ్‌ చదువుతున్నాడు. కొద్ది రోజులుగా సంగారెడ్డిలోని ఓ లాడ్జిలో ఉంటున్నాడు.

అయితే.. బుధ‌వారం లాడ్జిపై నుంచి కింద‌కు దూకి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు అక్క‌డ‌కు చేరుకున్నారు. మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కాగా.. ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాలు తెలియాల్సిఉంది.

ఇదిలా ఉంటే.. ఆగస్టు 31 ఎంటెక్ చదువుతున్న రాహుల్ అనే విద్యార్థి క్యాంపస్ రూంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగ‌తి తెలిసిందే. రాహుల్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా. కాగా.. రాహుల్ ఎలా మృతి చెందాడన్న విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. ప‌ది రోజుల వ్య‌వ‌ధిలోనే ఇద్ద‌రు విద్యార్థులు మృతి చెంద‌డంతో హైద‌రాబాద్ ఐఐటీలో ఆందోళ‌న నెల‌కొంది.

Next Story