దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. చదువు ఒత్తిడి, చిన్న చిన్న విషయాలకే తనువు చాలిస్తున్నారు. తాజాగా మరో ఐఐటీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 23 ఏళ్ల ఐఐటీ-ఢిల్లీ విద్యార్థి తూర్పు ఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలోని తన ఇంట్లో వెయిట్ లిఫ్టింగ్ రాడ్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు బుధవారం తెలిపారు. నాలుగో సంవత్సరం బి టెక్ విద్యార్థి పనవ్ జైన్ మృతదేహాన్ని అతని తల్లిదండ్రులు మంగళవారం రాత్రి 9 గంటలకు సాయంత్రం నడక నుండి తిరిగి వచ్చిన తర్వాత చూశారని వారు తెలిపారు.
పనవ్ తమ ఇంట్లో అమర్చిన వెయిట్ లిఫ్టింగ్ రాడ్ వద్ద దుపట్టా (కండువా)తో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. బాధితుడిని తల్లిదండ్రులు పుష్పాంజలి ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని వారు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తన కొడుకు గత కొన్ని నెలలుగా ఒత్తిడి, డిప్రెషన్‌తో బాధపడుతున్నాడని, డిప్రెషన్‌కు కూడా చికిత్స తీసుకుంటున్నాడని పనవ్ తండ్రి చెప్పినట్లు తెలిసింది. ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. తదుపరి విచారణలు కొనసాగుతున్నాయి.