ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినప్పటికి మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. నిత్యం ఏదో ఒక చోట మహిళలపై దారుణాలు జరుగుతున్నాయి. పని చేసే ప్రదేశాల్లో సైతం మహిళలకు రక్షణ లేకుండా పోయింది. తనపై అత్యాచారానికి పాల్పడిరనే మహిళా అధికారిణి ఫిర్యాదు మేరకు పోలీసులు ఫ్లైట్ లెఫ్టినెంట్‌ను అరెస్ట్ చేశారు. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులోని ఎయిర్‌ఫోర్స్ అడ్మినిస్ట్రేటివ్ కాలేజ్‌లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన ఓ మహిళా అధికారిణి కోయంబత్తూరులోని ఎయిర్‌ఫోర్స్ అడ్మినిస్ట్రేటివ్ కాలేజ్ కొన్ని నెలలుగా శిక్షణ పొందుతున్నారు. ఇటీవల శిక్షణ సమయంలో ఆమె గాయడింది. మందులు వేసుకుని నిద్రపోయింది. నిద్రలేచిన అనంతరం తనపై అత్యాచారం జరిగినట్లు ఆమె గుర్తించింది. ఈ ఘటనపై పై అధికారులకు ఫిర్యాదు చేసింది. వారు పట్టించుకోకపోవడంతో..గాంధీపురం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. చత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి చెందిన ఫ్లైట్ లెఫ్టినెంట్‌ను ఆదివారం అరెస్ట్ చేశారు. అనంతరం న్యాయమూర్తి ఎదుట ప్రవేశ పెట్టగా.. రెండురోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.