Hyderabad: బంగారు నగల కోసం.. మహిళను దారుణంగా చంపారు
హైదరాబాద్: నగర శివారులోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. సోమవారం రాత్రి ఓ మహిళను దుండగులు అతి కిరాతకంగా హత్య చేవారు.
By అంజి Published on 24 Sept 2024 1:43 PM ISTHyderabad: బంగారు నగల కోసం మహిళ దారుణ హత్య
హైదరాబాద్: నగర శివారులోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. సోమవారం రాత్రి ఓ మహిళను దుండగులు అతి కిరాతకంగా హత్య చేవారు. మల్లంపేటలోని ఓ అపార్టుమెంటులో బొద్దుల శారద (50)ను బంగారం కోసం గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
నిందితులు ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలను కూడా దోచుకున్నారని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లంపేటలోని ఓ అపార్ట్‌మెంట్‌లో శారద, ఆమె కుమారుడు నివాసం ఉంటున్నారు . సోమవారం ఉదయం ఆమెను యథావిధిగా ఇంటి ఉంచి కొడుకు సాయి వినయ్ పనికి వెళ్లాడు.
రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగి వచ్చే ముందు ఆమెకు ఫోన్ చేశాడు. పదే పదే కాల్ చేసినా స్పందన రాకపోవడంతో, అతను ఆమెను తనిఖీ చేయడానికి పొరుగువారిని సంప్రదించాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న శారదను ఇరుగుపొరుగు వారు గుర్తించి కుమారుడికి సమాచారం అందించడంతో అతడు ఇంటికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. నిందితులు ఆమెను మట్టుబెట్టి బంగారు చెవిపోగులు, ముక్కుపుడకను అపహరించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. హత్య కేసు నమోదు చేశామని, తదుపరి దర్యాప్తు జరుపుతున్నామని అధికారి తెలిపారు.
ఇదిలా ఉంటే.. వృద్ధురాలికి మద్యం తాగించి ఆభరణాలు చోరీ చేసిన ఘటన చింతలపల్లి మండలం జగ్గంగూడలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలి ఇంటిపక్కనే ఉండే దంపతులు పుట్టిన రోజు ఉందని పిలిపించి మద్యం తాగించారు. ఆమె నోట్లో గుడ్డలు దూర్చి చేతులు కట్టేసి 7 తులాల బంగారం, 30 తులాల వెండి దోచుకెళ్లారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.