మహిళతో అర్ధరాత్రి ఉబర్ డ్రైవర్ అసభ్య ప్రవర్తన..అరవడంతో చివరకు..
పశ్చిమ బెంగాల్‌కు చెందిన 23 ఏళ్ల ఓ మహిళ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తోంది.
By న్యూస్‌మీటర్ తెలుగు
మహిళతో అర్ధరాత్రి ఉబర్ డ్రైవర్ అసభ్య ప్రవర్తన..అరవడంతో చివరకు..
పశ్చిమ బెంగాల్‌కు చెందిన 23 ఏళ్ల ఓ మహిళ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తోంది. ఆమె ఉబర్ బైక్ రైడర్ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపిస్తూ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆదివారం అర్థరాత్రి ఆమె పని ముగించుకుని ఇంటికి వస్తుండగా ఈ ఘటన జరిగింది.
బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహిళ ఎర్రమంజిల్‌లోని పివిఆర్ సినిమా వద్ద తన విధులను ముగించుకుని.. సనత్ నగర్ సమీపంలోని తన నివాసానికి వెళ్లడానికి రాత్రి 11:35 గంటలకు ఉబర్ బైక్‌ను బుక్ చేసుకుంది. రాకేష్ అనే ఉబెర్ రైడర్ ఆమెను పికప్ చేసేందుకు లొకేషన్ వద్దకు వచ్చాడు. అయితే రైడ్ సమయంలో అతడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. అతడు తనను అనుచితంగా తాకాడని.. అతని ఫోన్‌లో తనకు అభ్యంతరకరమైన వీడియోలను చూపించాడని మహిళ పేర్కొంది. మహిళ ఇంటికి చేరుకునే సరికి పరిస్థితి శృతిమించింది. రైడర్ చర్యలతో కలత చెందిన మహిళ సహాయం కోసం అరవడం ప్రారంభించింది. రైడర్ బైక్ ఆపడంతో ఆమె వేగంగా దిగింది. సహాయం కోసం ఆమె కేకలు వేయడంతో సమీపంలోని నివాసితులు వెంటనే స్నందించి అక్కడికి చేరుకున్నారు. ఈ లోపే ఉబర్ రైడర్ డబ్బుల కూడా తీసుకోకుండా బైక్‌తో పారిపోయాడు. మహిళ ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు.. ప్రస్తుతం కేసు దర్యాప్తు చేస్తున్నారు.