విషాదం.. కొడుకు ప్రయోజకుడు కావట్లేదని తండ్రి ఆత్మహత్య

హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది.

By Srikanth Gundamalla  Published on  12 April 2024 12:10 PM IST
hyderabad, tragedy, father, suicide ,

విషాదం.. కొడుకు ప్రయోజకుడు కావట్లేదని తండ్రి ఆత్మహత్య 

హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే.. వీరిలో కుమార్తె మానసిక వ్యాధితో బాధపడుతోంది. ఉన్న కుమారుడు అయినా సరిగ్గా ఉంటాడు అనుకుంటే.. అతనూ చెప్పినట్లు వినడం లేదు. జీవితంలో ఉపయోగపడే పని చేసుకుంటూ ప్రయోజకుడు అవ్వాలని తండ్రి పదేపదే చెప్పాడు. కానీ.. కొడుకు తండ్రి మాటలను పెడచెవిన పెట్టాడు. దాంతో.. తీవ్ర మనస్థాపంలో ఉండిపోయిన తండ్రి చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు.

హైదరాబాద్‌లోని అత్తాపూర్‌ పోలీస్‌ స్టేషన్ పరిధి ఉప్పర్‌పల్లిలో ఈ సంఘటన గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకాకం.. బేగంబజార్‌కు చెందిన దేవిదాస్‌ అగర్వాల్‌ (50) ఎల్‌ఐసీ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. మూడేళ్ల క్రితం ఉప్పర్‌పల్లిలో నివాసం ఉండేందుకు వచ్చాడు. ఇక ఇతనికి ఒక కుమార్తు, కుమారుడు ఉన్నారు. కుమార్తె మానసిక దివ్యాంగురాలు. కుమారుడు మహదేవ్‌ క్యాబ్‌ డ్రైవర్. అతనికి ఇటీవలే వివాహం జరిగిందని పోలీసులు తెలిపారు. కారు కొనేందుకు తండ్రి ఇటీవల కొంత డబ్బుని కొడుక్కి ఇచ్చాడు. వాటిని నిర్లక్ష్యంగా ఖర్చు చేసినట్లు పోలీసులు తెలిపారు. చేసేశాడు.

కష్టపడి సంపాదించిన సొమ్మును దుర్వినియోగం చేయడంతో తండ్రి అసహనం వ్యక్తం చేశాడు. ఇదే విషయంలో తండ్రీకొడుకుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతూ వచ్చాయి. దాంతో.. మనస్తాపం చెందిన దేవిదాస్‌ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఉప్పర్‌పల్లిలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌ వద్దకు వెళ్లాడు. అక్కడ ఒక రూమ్‌ అద్దెకు తీసుకుంటానని చెప్పాడు. ఈ క్రమంలోనే పదో అంతస్తులో రూమ్‌ ఉందని చెప్పడంతో అతను చూసేందుకు వెళ్తున్నట్లు చెప్పి పైకి వెళ్లాడు. ఇక అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసకున్నాడు దేవిదాస్ అగర్వాల్. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Next Story