Hyderabad: ఇంటర్వ్యూకి వచ్చిన యువతిపై అత్యాచారయత్నం
మహిళలపై అఘాయిత్యాల సంఘటనలు పెరుగుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 10 May 2024 12:39 PM ISTHyderabad: ఇంటర్వ్యూకి వచ్చిన యువతిపై అత్యాచారయత్నం
మహిళలపై అఘాయిత్యాల సంఘటనలు పెరుగుతున్నాయి. ఇంట్లో నుంచి బయటకు వచ్చినా.. ఆఫీసుకెళ్లినా ఎక్కడో చోట కామాంధులు తగులుతూనే ఉన్నారు. బయటకు వచ్చిన అమ్మాయి క్షేమంగా ఇంటికి వచ్చే వరకు తల్లిదండ్రుల్లో టెన్షన్ ఉన్న రోజులువి. తాజాగా హైదరాబాద్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఇంటర్వ్యూకి వచ్చిన అమ్మాయిని నమ్మించిన మేనేజర్.. ఆమెను ఇంటికి పిలిపించుకుని అత్యాచార యత్నం చేశాడు. అయితే.. సదురు యువతి ఎలాగోలా తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అమీర్‌పేట్ మధురానగర్ లో ఈ సంఘటన జరిగింది. ప్రస్తుతం ఈ వార్త స్థానికంగా కలకలం రేపుతోంది. మధురానగర్‌లోని ఓ కంపెనీలో జాబ్ వేకెన్సీ గురింఇ తెలుసుకున్న యువతి ఇంటర్వ్యూ కోసం వెళ్లింది. ఇక ఇంటర్యూ పూర్తయ్యాక.. ఆమె సెలెక్ట్ అయినట్లు చెప్పాడు సాఫ్ట్‌వేర్ కంపెనీ మేనేజర్ నవీన్ కుమార్. దాంతో.. ఆమె ఎంతో సంతోష పడింది. ఆర్థికంగా కాస్త కుదటపడొచ్చు. ఇక నుంచి డబ్బులు ఇంట్లో కూడా ఇవ్చొచ్చని భావించింది. మేనేజర్‌కు థ్యాంక్యూ చెప్పింది. అయితే.. నవీన్ కుమార్‌కు సదురు యువతిపై కన్ను పడింది. దాంతో.. ఆఫీస్ సిమ్ కార్డు ఇస్తుందనీ.. దాన్ని తీసుకునేందుకు తన ఇంటికి రావాలని చెప్పాడు. దాంతో.. అతని మాటలు నమ్మిన యువతి అలాగే నవీన్ కుమార్ ఇంటికి వెళ్లింది.
ఇక నవీన్ కుమార్ ఇంటికి వెళ్లింది సదురు యువతి. ఆమెను మాటల్లో పెట్టిన కామాంధుడు డోర్‌ను లాక్ చేసి ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. దాంతో.. ప్రతిఘటించిన యువతి అక్కడి నుంచి పారిపోయి బయటకు వచ్చేసింది. వెంటనే పోలీసులకు వెళ్లి ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మధురానగర్ పోలీసులు.. నవీన్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. గతంలో కూడా నవీన్ ఇలా ఎవరిపట్ల అయినా ప్రవర్తించాడా? అమ్మాయిలను మోసం చేశాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు మధురానగర్ పోలీసులు చెప్పారు. ఇలాంటి వారి పట్ల అమ్మాయిలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పోలీసులు ఈ సందర్భంగా సూచించారు.