బాలాపూర్‌లో దారుణం.. రౌడీషీటర్‌ను కాల్చి చంపారు

బాలాపూర్‌లో గురువారం రాత్రి ఓ రౌడీషీటర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. గన్ తో మూడు రౌండ్ల కాల్పులు జరిపి హత్య చేశారు.

By అంజి  Published on  9 Aug 2024 12:19 PM IST
Hyderabad, Rowdy sheeter, shot dead , Balapur

బాలాపూర్‌లో దారుణం.. రౌడీషీటర్‌ను కాల్చి చంపారు

హైదరాబాద్: బాలాపూర్‌లో గురువారం రాత్రి ఓ రౌడీషీటర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. గన్ తో మూడు రౌండ్ల కాల్పులు జరిపి హత్య చేశారు. రౌడీషీటర్‌ మహ్మద్ రియాజ్ (35) మోటార్‌సైకిల్‌పై వెళ్తుండగా కారుతో ఢీకొట్టారు. అతను రోడ్డుపై పడిపోయిన తర్వాత దుండగులు అతనిపై దాడి చేసి, దేశీ తుపాకీతో కాల్చి చంపారు. ఆ తర్వాత దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.

స్థానికుల ద్వారా హత్య ఘటన గురించిన తెలుసుకున్న బాలాపూర్ పోలీసులు, ఇతర అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు ఘటనా స్థలం నుంచి బుల్లెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. సంఘటనా స్థలాన్ని రాచకొండ పోలీస్ కమిషనర్ జి సుధీర్ బాబు పరిశీలించారు. పరారీలో ఉన్న దుండగులను పట్టుకునేందుకు ఎస్‌ఓటీ, టెక్నికల్ టీమ్‌లు స్థానిక పోలీసులకు సహాయం అందిస్తున్నాయి. కాగా ఈ హత్య కేసులో నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

బాబా నగర్ సి బ్లాక్‌లో నివాసం ఉంటున్న మృతుడు రియాజ్ (39) గతంలో పలు హత్య కేసుల్లో పలు నేరాల్లో ప్రమేయం ఉంది. గత కొన్ని సంవత్స రాలుగా రౌడి షీటర్ చాకు నజీర్ తో మృతుడు రియాజ్ మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఫజల్ అనే రౌడీ షీటర్ హత్య కేసులో మృతుడు రియాజ్ నిందితుడుగా ఉన్నాడు. రౌడీ షీటర్ చాకు నజీర్ మృతుడు రియాజ్ ఇద్దరీకి మధ్య వైరం జరుగుతూ ఉండడంతో నజీర్ ఎలాగైనా సరే రియాజ్‌ను అంతమొందించాలని పథకం వేశాడు. ఈ పథకంలో భాగంగానా రియాజ్ పై నిఘాపెట్టారు. రియాజ్ బాలాపూర్ పరిధిలోకి రాగానే వాహనంతో ఢీకొట్టి.. అనంతరం కారంతో కలిపిన నీళ్లు రియాజ్ కళ్ళలో చల్లి రియాజ్ పై పిస్టల్ తో కాల్పులు జరిపారని తెలుస్తోంది.

అయితే ఈ ఘటనపై బాలాపూర్ పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే రాచకొండ ఎస్ఓటి, హైదరాబాద్ సౌత్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఈ నేపథ్యంలోనే పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ లో పరిశీలిస్తున్నారు. కంచన్ బాగ్ లిమిట్స్ లో రౌడీ షీటర్ రియాజ్ మద్యం సేవించినట్లు సమాచారం.

Next Story