Hyderabad: ఇంటి నుంచి పారిపోయి వచ్చిన యువతిపై అత్యాచారం

సోదరుడితో గొడవపడి హైదరాబాద్‌కు పారిపోయి వచ్చిన ఓ యువతిపై ఇద్దరు దుండుగులు అత్యాచారానికి పాల్పడ్డారు.

By Srikanth Gundamalla  Published on  8 Jan 2024 10:13 AM GMT
hyderabad, rape,  girl, crime,

Hyderabad: ఇంటి నుంచి పారిపోయి వచ్చిన యువతిపై అత్యాచారం

హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. సోదరుడితో గొడవపడి హైదరాబాద్‌కు పారిపోయి వచ్చిన ఓ యువతిపై ఇద్దరు దుండుగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ సంఘటన బండ్లగూడ పోలీస్‌ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బండ్లగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యపేట్‌కు చెందిన యువతి (21) ఈ నెల 6వ తేదీని రాత్రి ఆమె సోదరుడితో గొడవ పడింది. ఇద్దరి మధ్య ఘర్షణ పెద్దఎత్తున జరగింది. దాంతో.. ఆగ్రహానికి గురైన సోదరుడు యువతిని తీవ్రంగా కొట్టాడు. ఆ ఘర్షణతో యువతి తీవ్ర మనస్థాపానికి గురైంది. ఇంట్లో ఉండకూడదు అని నిర్ణయం తీసుకుంది. ఆ వెంటనే అదే రోజు రాత్రి 10.40 గంటల సమయంలో సూర్యాపేట్‌లో బస్సు ఎక్కి హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌కు చేరుకుంది. అక్కడే ఒక టీస్టాల్‌ వద్ద టీ తాగింది. ఆ తర్వాత రోడ్డు దాటుతుండగా.. ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి ఆమెను అడ్డగించారు. ఎక్కడికి వెళ్తున్నారని అడిగారు. ఆమెతో మాటామాటా కలిపి వివరాలన్నీ తెలుసుకున్నారు.

దుండుగులతో యువతి తాను పోలీస్‌ స్టేషన్‌కు వెళ్తున్నాననీ చెప్పింది. దాంతో.. వారు కూడా అక్కడికే వెళ్తున్నామని ఈ సమయంలో ఆటోలో వెళ్లొద్దని తాము తీసుకెళ్తామని చెప్పారు. యువతి ముందుగా తాను బైక్‌ ఎక్కను ఆటోలోనే వెళ్తానని చెప్పింది. కానీ.. ఆ ఇద్దరు దుండుగుల మాత్రం వదల్లేదు. మాట వినకుండా బలవంతంగా ఆమెను బైక్‌పై ఎక్కించుకుని పాతబస్తీలోని గౌస్‌నగర్‌ వడ్డెర బస్తీలోని ఓ స్క్రాబ్‌ గోదాంకు తీసుకెళ్లారు. అక్కడ సదురు యువతిని చితకబాది ఇద్దరు ఆగంతుకులు అత్యాచారానికి పాల్పడ్డారు. కాసేపటికే యువతి అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకుని కేకలు వేస్తూ బయటకు పరిగెత్తుకు వచ్చింది. ఆమె అరుపులు విన్న స్థానికులు వెంటనే ఆమె వద్దకు వెళ్లారు. విషయం తెలుసుకుని దుండుగులను పట్టుకునేందుకు వెళ్లగా.. వారు అప్పటికే పరారయ్యారు.

కాగా.. బాధితురాలు స్థానికుల సాయంతో బండ్లగూడ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఆదివారం తెల్లవారుజామున ఫిర్యాదు చేసింది. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు కేసు నమోదు చేశామనీ.. ఇద్దరు వ్యక్తులపై ఐపీసీ 366, 376 (డి), 342 రెడ్​ విత్​ 34 సెక్షన్​ల కింద కేసు నమోదు చేశామన్నారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు బండ్లగూడ పోలీసులు.

Next Story