హైదరాబాద్ అత్యాచార ఘటన.. అంతా ఓ నాటకం..!
Hyderabad police cracked Santosh Nagar Gang rape case.తాను ఆటో ఎక్కగా ఆటో డ్రైవర్ దారి మళ్లించి తనపై అత్యాచారం
By తోట వంశీ కుమార్ Published on 19 Aug 2021 10:50 AM ISTతాను ఆటో ఎక్కగా ఆటో డ్రైవర్ దారి మళ్లించి తనపై అత్యాచారం చేశాడని ఓ యువతి తన తల్లిదండ్రులతో కలిసి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. భాగ్యనగరాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కేసును చేదించారు. తనను కాదని మరో యువతిని వివాహం చేసుకుంటున్న బాయ్‌ఫ్రెండ్‌ను ఇరికించేందుకే యువతి నాటకం ఆడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. సంతోష్ నగర్‌లోని ఓ ల్యాబ్‌లో పనిచేస్తున్న యువతి ఎప్పటిలాగా ఈనెల 17న రాత్రి విధులకు వెళ్లింది. ప్రతిరోజు ఆమె 9.30గంటలకు ఇంటికి వస్తుండగా.. ఆ రోజు గంట ఆలస్యంగా రాత్రి 10.30గంటలకు వెళ్లింది.
ఎందుకు ఆలస్యమైందని తల్లిదండ్రులు ఆ యువతిని ప్రశ్నించారు. దీంతో ఆటో డ్రైవర్ తనను అత్యాచారం చేశాడని ఆ యువతి తల్లిదండ్రులకు చెప్పింది. భయపడిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు యాదగిరి థియేటర్ నుంచి పహాడీషరీఫ్ వరకు రోడ్లపై ఉన్న అన్ని సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించగా ఒక్క క్లూ కూడా లభించలేదు. యువతి ఆటో ఎక్కిన సమయం ఆమె చెప్పే అంశాలకు ఎక్కడా పొంతన కుదరలేదు. సీసీ కెమెరాల్లో కనిపించిన ఆటోలు ఏ మార్గం నుంచి వెళ్లాయో ఆరా తీశారు. సంతోష్‌నగర్ నుంచి మైలార్‌దేవ్‌పల్లి, పహాడీషరీఫ్ ప్రాంతాల్లో సెల్ టవర్ సిగ్నల్స్‌ను విశ్లేషించారు. చాలా మంది ఆటో డ్రైవర్లనూ విచారించినా ఘటన జరిగినట్లు ఎటువంటి చిన్న ఆధారం కూడా పోలీసులకు లభించలేదు.
ఇక యువతికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. అత్యాచారం జరగలేదని తేలినట్లు తెలుస్తోంది. దీంతో యువతి ది తప్పుడు ఫిర్యాదుగా బావించిన పోలీసులు ఆమెను పూర్థిస్థాయిలో ప్రశ్నించగా.. అసలు విషయం చెప్పింది. తాను ఓ వ్యక్తిని ప్రేమించానని అయితే అతడు తనను కాదని మరో యువతితో వివాహం నిశ్చయం చేసుకున్నాడని.. ఆకక్ష్యతోనే ఇలా నాటకం ఆడినట్లు అసలు విషయాన్ని చెప్పింది. యువతి పై అత్యాచారం జరగలేదని లేలడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.