హైదరాబాద్: బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్‌కు చెందిన వర్షిత (16) బాచుపల్లిలోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ.. ఆమె తాను ఉంటున్న హాస్టల్ గదిలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఇది గమనించిన హాస్టల్ నిర్వాహకులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. బాచుపల్లి పీఎస్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్‌లో ఇంటర్మీడియట్ సెకండీయర్ చదువుతున్న మంజునాథ్ (15) అనే విద్యార్థి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. తమ కాలేజీలో చదువుతున్న ఫస్ట్ ఇయర్ విద్యార్థినిని మంజునాథ్ ప్రేమిస్తుడాని.. ఈ విషయం తెలిసి అమ్మాయి కుటుంబ సభ్యులు బెదిరించడంతోనే మంజునాథ్ బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యుల ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.