విషాదం.. డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

నార్సింగి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని హైదర్ షాకోట్ విషాదం చోటు చేసుకుంది. శ్రీజ అనే డిగ్రీ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

By అంజి  Published on  14 Nov 2024 10:34 AM IST
Hyderabad, degree student, suicide , Narsingi police station

విషాదం.. డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాద్: నార్సింగి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని హైదర్ షాకోట్ విషాదం చోటు చేసుకుంది. శ్రీజ అనే డిగ్రీ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన శ్రీజ హైదరాబాద్‌లో తన సోదరి ఇంట్లో ఉంటూ.. కోఠి ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్నది. ఏం జరిగిందో తెలియదు కానీ ఈరోజు ఉదయం శ్రీజ తన గదిలో ఉన్న ఫ్యాన్ కు ఉరేసు కుని ఆత్మహత్య చేసుకుంది.

ఎందుకు తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చి అక్క బావ తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా ఫ్యాన్ కు వేలాడుతూ శ్రీజ కనిపించడంతో బోరున విలపించారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు శ్రీజ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటో పోలీసులు తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

Next Story