యువతితో రూమ్ షేరింగ్..నిజం తెలుసుకునేలోపు చిక్కుల్లోపడ్డ ఉద్యోగి
రూమ్ షేరింగ్ పేరుతో వచ్చిన యువతి.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి షాక్ ఇచ్చింది.
By Srikanth Gundamalla Published on 17 Nov 2023 12:42 PM ISTయువతితో రూమ్ షేరింగ్..నిజం తెలుసుకునేలోపు చిక్కుల్లోపడ్డ ఉద్యోగి
ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రూము తీసుకుని ఒక్కడే ఉంటున్నాడు. స్నేహితులు కూడా ఎవరూ దగ్గర లేకపోవడంతో.. రూమ్ రెంట్ కట్టడానికి ఒక్కడికే ఇబ్బందులు వచ్చాయి. దాంతో.. రూమ్ షేరింగ్ అవసరమైన వారు తనని సంప్రదించవచ్చని.. ఒక యాడ్ ఇచ్చాడు. అయితే.. ఓ మహిళ రూమ్ షేర్ చేసునేందుకు సిద్ధమని అతనికి ఫోన్ చేసింది. దాంతో.. అతనూ ఒప్పుకొని రూమ్‌లోనే ఉండనిచ్చాడు. అలా వచ్చిన ఆమె సహజీవనం పేరుతో కొంతకాలం గడిపింది. తర్వాత తాను ప్రాస్టిట్యూట్ అన్న విషయం తెలిపింది. దాంతో.. ఆ ఉద్యోగి కంగుతిన్నాడు.
రూమ్ ఖాళీ చేయాలని చెప్పాడు. అక్కడే సమస్య మొదలయ్యింది. ఆ యువతి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టింది. అంతేకాదు దాడులు చేయించింది. ఆ తర్వాత చివరకు బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. అలా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇదంతా హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడాలోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
కిరణ్ కుమార్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కృష్ణనగర్‌లో ఉండేవాడు. అతను ఒక గదిని అద్దెకు తీసుకున్నాడు. ఒక్కడే ఉండటంతో రూమ్ షేర్ చేసుకునేందుకు ఇంట్రెస్ట్ ఉంటే తనని సంప్రదించవచ్చు అంటూ.. ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటన ఇచ్చాడు. ఆ ప్రకటన చూసిన ఓ మహిళ తనకు గది అవసరం ఉందంటూ అతడిని సంప్రదించి అతనితోపాటు రూమ్ షేర్ చేసుకోవడం మొదలుపెట్టింది. ఆ తర్వాత వీరిద్దరూ తమ మకాం కూకట్‌పల్లికి మార్చారు. అక్కడికి వెళ్లిన తర్వాత ఆమె తాను వేశ్య అన్న సంగతి చెప్పింది. దీంతో కిరణ్ వెంటనే ఆమెను రూమ్ ఖాళీ చేసి వెళ్లాలని కోరాడు. అప్పటికే వీరిద్దరి మధ్య సంబంధం కూడా ఏర్పడింది. రూమ్ ఖాళీ చేయమనడంతో ఆ మహిళ అంగీకరించలేదు.
అతనితో కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించింది. అంతేకాదు.. కిరణ్ తన మీద లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీస్ స్టేషన్ కి ఎక్కింది. సైబరాబాద్ షీ టీమ్స్ ను ఆశ్రయించింది. కిరణ్ నుంచి ఆమెకు పరిహారం కూడా ఇప్పించారు. అయినా.. ఆమె శాంతించలేదు. వారిద్దరి ఫొటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది. చివరకు పోలీసులకు జరిగిందంతా చెప్పాడు కిరణ్. పోలీసులు కూడా గట్టిగా నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు.