Hyderabad: ఇద్దరు పిల్లలను చంపి.. దంపతుల ఆత్మహత్య
హైదరాబాద్‌లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 1 Sept 2024 10:15 AM ISTహైదరాబాద్‌లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. గాజులరామారంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఇద్దరు పిల్లలను చంపి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో నుంచి బయటకు ఎవరూ రాకపోవడంతో స్థానికులు అనుమానం వచ్చి ఇంట్లో వాళ్లని పిలిచారు. కానీ.. ఎవరూ స్పందించలేదు. దాంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఇక స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఇంట్లోకి వెళ్లి చూసే సరికి నలుగురు చనిపోయి పడిఉన్నారు. మృతులను భార్యాభర్తలు వెంకటేశ్ (40), వర్షిణి (33), వారి పిల్లలు రిషికాంత్(11), విహంత్ (3)గా గుర్తించారు. వీరి స్వస్థలం మంచిర్యాలగా చెప్పారు. ఇక స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. ఆర్థిక ఇబ్బందులే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమి త్తం ప్రభుత్వాసు పత్రికి తరలించారు. తమ పిల్లలను ముందుగా చంపి.. తర్వాత దంపతులు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశామనీ.. దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. విచారణ పూర్తయిన తర్వాత తదుపరి విషయాలను వెల్లడిస్తామని పోలీసులు వెల్లడించారు.