విషాదం.. హెచ్‌సీయూలో ఎంటెక్ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌

Hyderabad Central university student Mounika commits suicide.ఇటీవ‌ల కాలంలో యువ‌త చిన్న చిన్న కార‌ణాల‌కే త‌నువు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Aug 2021 3:13 AM GMT
విషాదం.. హెచ్‌సీయూలో ఎంటెక్ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌

ఇటీవ‌ల కాలంలో యువ‌త చిన్న చిన్న కార‌ణాల‌కే త‌నువు చాలిస్తున్నారు. కార‌ణం ఏదైన‌ప్ప‌టికి.. వ‌చ్చిన క‌ష్టాన్ని స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కోలేక క్ష‌ణికావేశంలో బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డుతున్నారు. ఉన్న‌త విద్యావంతులు కూడా ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం. ఆ యువ‌తి ఎన్నో క‌ష్టాల‌కు ఓర్చీ ఎంస్‌సీ చ‌దువుతోంది. అయితే ఏం క‌ష్టం వ‌చ్చిందో తెలీదుకానీ.. ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. సూసైడ్ నోటులో 'ఐయామ్ సో బ్యాడ్ డాట‌ర్‌.. మిస్ యూ నాన్న‌.. అమ్మ' అని రాసుకొంది. ఈ విషాద ఘ‌ట‌న హైద‌రాబాద్ కేంద్రీయ విశ్వ‌విద్యాల‌యంలో చోటు చేసుకుంది.

పోలీసులు, విద్యార్థులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. పెద్దప‌ల్లి జిల్లా కాల్వ‌శ్రీరాంపూర్ మండ‌లం తారుప‌ల్లి గ్రామానికి చెందిన ల‌చ్చ‌య్య, ర‌జిత దంప‌తుల కుమారై ఆర్.మౌనిక‌(27) హెచ్‌సీయూలో నానో సైన్స్‌ ఎంఎస్‌సీ రెండవ సంవత్సరం చదువుతోంది. క్యాంప‌స్‌లోని మ‌హిళా వ‌స‌తి గృహం-7లోని రూమ్‌నెంబ‌ర్ 24లో ఉంటోంది. ఆదివారం రాత్రి నిద్ర‌కు ఉప‌క్ర‌మించింది. సోమ‌వారం ఉద‌యం ఎంత సేప‌టికి రూమ్ నుంచి బ‌య‌ట‌కు రాలేదు. తోటి విద్యార్థినిలు వెళ్లి పిలిచినా.. స్పంద‌న లేదు. ఫోన్ చేసినా లిప్ట్ చేయ‌లేదు. సాయంత్రం అయినా.. మౌనిక బ‌య‌ట‌కు రాక‌పోగా.. ఎలాంటి స్పందన లేక‌పోవ‌డంతో విద్యార్థినులు ఆందోళ‌న చెందారు. వెంటిలేట‌ర్‌లోంచి చూడ‌గా.. కిటీకీ చువ్వ‌కు ఉరివేసుకుని క‌పించింది.

విష‌యాన్ని మేనేజ్‌మెంట్ తో పాటు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. స‌మాచారం అందుకున్న పోలీసులు అక్క‌డ‌కు చేరుకున్నారు. మృత‌దేహాన్ని ప‌రిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఆగ‌దిలో ఓ సూసైడ్ నోటు ఉంది. అందులో 'ఐయాయ్ సో బ్యాడ్ డాట‌ర్‌.. మిస్ యూ నాన్న అమ్మ' అని రాసి ఉంది. అయితే.. మౌనిక ఆత్మ‌హ‌త్య‌కు గల కార‌ణాలు తెలియ‌రాలేదు. సూసైడ్ నోట్‌లో అలా ఎందుకు రాసిందో, అది ఆమె రైటింగో కాదో తెలుసుకునే పనిలో ఉన్నారు పోలీసులు.

కాగా.. రెండు రోజుల క్రితం తల్లిదండ్రులు మౌనికకు ఫోన్‌ చేసి పెళ్లి సంబంధాలు చూస్తున్నామని చెప్పినట్లుగా తోటి విద్యార్థినుల ద్వారా తెలిసింది. మౌనిక తండ్రి ల‌చ్చ‌య్య గ్రామంలోనే వ్య‌వ‌సాయం చేస్తుంటారు. ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు స్థానికంగా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో చదివిన త‌రువాత మౌనిక బాస‌ర ట్రిపుల్ ఐటీలో సీటు వ‌చ్చింది. అక్క‌డ ఇంజినీరింగ్ పూర్తి చేసుకుని హెచ్‌సీయూలో ఎంటెక్ చదువుతోంది.

Next Story
Share it