Hyderabad: శామీర్‌పేట్‌లో బస్సు దగ్ధం.. ఒకరు మృతి

హైదరాబాద్‌ శివార్లలోని మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట వద్ద ఎదురుగా వస్తున్న ప్రైవేట్‌ బస్సును బైక్‌ ఢీకొట్టింది.

By అంజి  Published on  22 Aug 2023 1:40 PM IST
Hyderabad, Bus gutted, Shameerpet

Hyderabad: శామీర్‌పేట్‌లో బస్సు దగ్ధం.. ఒకరు మృతి

హైదరాబాద్‌ శివార్లలోని మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట వద్ద ఎదురుగా వస్తున్న ప్రైవేట్‌ బస్సును బైక్‌ ఢీకొట్టింది. మంగళవారం నాడు ఉదయం జరిగిన ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా, రెండు వాహనాలు దగ్ధమయ్యాయి. మృతుడు సిద్దిపేట జిల్లాకు చెందిన సంపత్ (26)గా గుర్తించారు. బస్సు ఫార్మా కంపెనీకి చెందినది. బస్సు జీనోమ్ వ్యాలీలోని ఓ ఫార్మా కంపెనీ ఉద్యోగులను తీసుకెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రమాదంలో బైక్ ట్యాంకర్ నుండి పెట్రోల్ లీక్ కావడంతో మంటలు చెలరేగాయి. బస్సు చక్రాల కిందకు వచ్చిన బైక్‌లోని మంటలు నాలుగు చక్రాల వాహనాన్ని దగ్ధమయ్యేలా చేశాయి. దీంతో మంటల్లో చిక్కుకున్న బైకర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బస్సులో ప్రయాణిస్తున్న వారు వెంటనే కిందకు దిగడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిమాపక యంత్రం ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. కాగా మంటల్లో చిక్కుకుని మృతి చెందిన వ్యక్తిని సంపత్‌గా పోలీసులు గుర్తించారు. సంపత్ స్వస్థలం సిద్దిపేట జిల్లా ములుగు మండలం వరదరాజపురం అని పోలీసులు తెలిపారు.

Next Story