Hyderabad: ప్రేమ పెళ్లి.. ఆపై భర్త వరకట్న వేధింపులు.. బి.టెక్ విద్యార్థిని ఆత్మహత్య

మన్సూరాబాద్‌లోని తన నివాసంలో 21 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థిని తన భర్త, అతని కుటుంబం నుండి వరకట్నం డిమాండ్ కారణంగా ఒత్తిడి, వేధింపులను ఎదుర్కొని ఆత్మహత్య చేసుకుంది.

By -  అంజి
Published on : 19 Nov 2025 7:36 AM IST

Hyderabad, B.Tech student ends life , LB Nagar, dowry harassment

Hyderabad: ప్రేమ పెళ్లి.. ఆపై భర్త వరకట్న వేధింపులు.. బి.టెక్ విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాద్‌: మన్సూరాబాద్‌లోని తన నివాసంలో 21 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థిని తన భర్త, అతని కుటుంబం నుండి వరకట్నం డిమాండ్ కారణంగా ఒత్తిడి, వేధింపులను ఎదుర్కొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నవంబర్ 17న జరిగింది. బాధితురాలు కుంచం గంగోత్రిగా గుర్తించబడింది. ఆమె తన గదిలో చనిపోయి తన తల్లికి కనిపించింది. తల్లి పొరుగువారి సహాయంతో తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లింది. సంఘటన స్థలంలో ఒక సూసైడ్ నోట్ దొరికింది.

బాధితురాలి తండ్రి కుంచం సైదులు (45) ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. రోజువారీ కూలీ అయిన ఈ కుటుంబం నాలుగు సంవత్సరాల క్రితం నల్గొండ జిల్లా నుండి వాంబే కాలనీకి పని వెతుక్కుంటూ వెళ్లింది. గంగోత్రి అబ్దుల్లాపూర్మెట్‌లోని బ్రిలియంట్ ఇంజనీరింగ్ కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ మూడవ సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలోనే గంగోత్రి చిన్నరవిరాల గ్రామానికి చెందిన 23 ఏళ్ల భానుతో ప్రేమలో పడిందని, వారిద్దరూ ఫిబ్రవరి 26, 2025న కీసరగుట్టలో వివాహం చేసుకున్నారని దర్యాప్తులో తేలింది. ఈ వివాహానికి ఇరు కుటుంబాలు అంగీకరించలేదు. నవంబర్ 16న, భాను, అతని బావమరిది భరత్ వారి ఇంటికి వెళ్లి ₹30 లక్షలు, 10 తులాల బంగారం కట్నంగా డిమాండ్ చేశారు.

కుటుంబం నిరాకరించడంతో అతని కుమార్తెను బెదిరించారు. మరుసటి రోజు సైదులు పని వెళ్లినప్పుడు, గంగోత్రి తన గదిలో తాళం వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భాను, అతని తల్లిదండ్రులు యెల్లా స్వామి, జయమ్మ, అతని సోదరి నందిని, బావమరిది భరత్, జన్ర్సు వెంకటేశ్వర్లు ఆమె మరణానికి ప్రేరేపించారని బాధితురాలి కుటుంబం అనుమానించింది. ఈ ఘటనపై ఎల్బీ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

(రోషిణి ఆత్మహత్య నివారణ హెల్ప్‌లైన్ నంబర్లు: 8142020033/44 మరియు 040 66202000/2001.)

Next Story