రెచ్చిపోతున్న దొంగలు..పట్టపగలే పార్క్ చేసిన బైక్ చోరీ
హైదరాబాద్ నగరంలో రోజురోజుకీ దొంగలు మితిమీరి పోతున్నారు.
By Srikanth Gundamalla Published on 21 July 2023 5:17 AMరెచ్చిపోతున్న దొంగలు..పట్టపగలే పార్క్ చేసిన బైక్ చోరీ
హైదరాబాద్ నగరంలో రోజురోజుకు దొంగలు మితిమీరి రెచ్చిపోతున్నారు. తాళం వేసిన ఇళ్లలోనే కాదు.. లాక్ చేసి పార్క్ చేసిన వాహనాలను కూడా వదలడం లేదు. అర్థరాత్రి కూడా కాదు.. పట్టపగలే జనాలు తిరుగుతుండగానే దొంగలు చోరీలు చేస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే కామటిపుర పోలీస్‌ష్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. చోరీకి సంబంధించిన వీడియో అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హైదరాబాద్ నగరంలో రోజురోజుకీ దొంగలు మితిమీరి పోతున్నారు. పుష్పేందర్ అనే వ్యక్తి కామటిపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని పురాణాపూల్‌లో నివాసం ఉంటున్నాడు. జూలై 20న మధ్యాహ్నం శివాలయానికి వెళ్లాడు. అక్కడే పార్క్ చేసి ఉన్న కొన్ని బైక్‌ల మధ్య తన స్పెండర్ ప్లస్ బైక్‌ను లాక్ చేసి గుళ్లో దేవుడి దర్శనం కోసం వెళ్లాడు. మధ్యాహ్న సమయం కావడంతో జనాలు కూడా అక్కడే బాగానే తిరుగుతున్నాడు. అప్పుడే ఓ వ్యక్తి పార్క్ చేసిన బైక్‌ల వద్దకు వచ్చాడు. అటూ ఇటూ తిరుగుతూ బైక్‌లను పరిశీలించాడు. రెండు వాహనాల మధ్యలో పార్క్ చేసి ఉన్న హీరో బైక్ తనదే అన్నట్లు దొంగతనం చేసి అక్కడి నుంచి ఉడాయించాడు. కొద్ది సేపటి తర్వాత గుడి నుంచి బయటకు వచ్చిన పుష్పేందర్ బైక్ కనిపించకపోవడంతో షాక్ అయ్యాడు. వెంటనే కామటిపురా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. బైక్ మిస్సింగ్‌పై కంప్లైంట్ ఇచ్చాడు.
బాధితుడి ఫిర్యాదుతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించారు. అయితే దొంగ దర్జాగా బైకులు తీసుకు వెళుతున్న దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. వాటిని ఆధారంగా చేసుకుని పోలీసులు కేసు నమోదు చేసుకుని దొంగ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.