Hyderabad: కదులుతున్న రైలులో బాలికపై లైంగికదాడి.. అరగంట పాటు..

ఎంఎంటీఎస్‌లో యువతిపై అత్యాచారయత్నం ఘటన మరవముందే.. మరో రైలులో బాలికపై లైంగిక దాడి ఘటన కలకలం రేపింది.

By అంజి
Published on : 4 April 2025 10:54 AM IST

Hyderabad, assaulted, minor girl , moving train, Harassment

Hyderabad: కదులుతున్న రైలులో బాలికపై లైంగికదాడి.. అరగంట పాటు.. 

హైదరాబాద్‌: ఎంఎంటీఎస్‌లో యువతిపై అత్యాచారయత్నం ఘటన మరవముందే.. మరో రైలులో బాలికపై లైంగిక దాడి ఘటన కలకలం రేపింది. రక్సెల్‌ - సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఓ 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం ఒడిశాకు చెందిన బాలిక తన కుటుంబంతో కలిసి రైలులో ప్రయాణిస్తూ తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో రైలు మహారాష్ట్రలోని కెల్జార్‌కు చేరుకునే సమయానికి వాష్‌రూమ్‌కు వెళ్లింది.

రైలులో ప్రయాణిస్తున్న బాలిక మిడ్‌నైట్‌ సమయంలో వాష్‌రూమ్‌కు వెళ్లింది. వెనకాలే ఓ వ్యక్తి అందులోకి ప్రవేశించాడు. అరగంట పాటు ఆమెను లైంగికంగా వేధించాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించి, ఆ చర్యను తన మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేశాడు. బాలిక వెంటనే తన తల్లిదండ్రులకు జరిగిందంతా చెప్పింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న బాలిక తల్లిదండ్రులు ప్రభుత్వ రైల్వే పోలీసులకు (GRP) ఫిర్యాదు చేశారు, వారు కేసు నమోదు చేసి, అధికార పరిధిలో స్థానిక పోలీసులకు బదిలీ చేస్తామని చెప్పారు. బాలికను వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు . నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Next Story