Hyderabad: కిడ్నాప్‌కు గురైన 12 ఏళ్ల బాలిక.. ఎలా తప్పించుకుందంటే?
హైదరాబాద్ నగరంలో గత కొన్ని నెలలుగా బాలికలు కిడ్నాప్ కు గురవుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి.
By అంజి Published on 10 Aug 2024 8:04 AM GMTHyderabad: కిడ్నాప్‌కు గురైన 12 ఏళ్ల బాలిక.. ఎలా తప్పించుకుందంటే?
హైదరాబాద్ నగరంలో గత కొన్ని నెలలుగా బాలికలు కిడ్నాప్ కు గురవుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. దీంతో ఆడపిల్లలను బయటకు పంపించలాంటేనే తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పుడు తాజాగా మరో బాలిక కిడ్నాప్‌కు గురైంది.
హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బాలిక కిడ్నాప్ తీవ్ర కలకలం సృష్టించింది. అఘాపురాలో బాలిక తన తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటోంది. నిన్న రాత్రి సమయంలో అక్కడ కరెంట్ పోయింది. అదే సమయంలో గుర్తు తెలియని కొందరు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి, బాలికను బలవంతంగా కారులో ఎత్తుకుపోయారు. అయితే బాలిక తాను కిడ్నాప్ కు గురి అయినట్లుగా గుర్తించింది. బాలిక సమయ స్ఫూర్తితో వ్యవహారించి తన పట్టుకున్న నిందితుడి చేతిని గట్టిగా కొరికి చాక చక్యంగా అక్కడి నుండి తప్పించుకున్నది. అనంతరం బాలిక పరిగెత్తు కుంటూ వెళ్లి... నాంపల్లి రైల్వే పోలీసులను ఆశ్రయించింది.
బాలిక విషయం మొత్తం పోలీసులకు వెల్లడించింది. బాలిక చేసిన ధైర్యసాహ సాన్ని పోలీసులు అభినందించారు. అనంతరం నాంపల్లి రైల్వే పోలీసులు బాలిక తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. రైల్వే పోలీసులు బాలికను సురక్షితంగా తల్లి దండ్రులకు అప్పగించారు. హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్లో బాలిక తండ్రి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు బాలిక తెలిపిన వివరాలను ఆధారంగా చేసుకుని పరిసర ప్రాంతాల్లో ఉన్న సిసిటివి ఫుటే జ్ ను పరిశీలించి, కిడ్నా పర్లనుగుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.