'నా భార్య వల్లే చనిపోతున్నా'.. లేఖ రాసి భ‌ర్త ఆత్మ‌హ‌త్య‌

Husband suicide due to family disputes.కార‌ణాలు ఏవైన‌ప్ప‌టికి ఇటీవ‌ల బ‌ల‌వ‌న్మ‌ర‌ణాల‌కు పాల్ప‌డుతున్న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Jun 2021 5:32 AM GMT
నా భార్య వల్లే చనిపోతున్నా.. లేఖ రాసి భ‌ర్త ఆత్మ‌హ‌త్య‌

కార‌ణాలు ఏవైన‌ప్ప‌టికి ఇటీవ‌ల బ‌ల‌వ‌న్మ‌ర‌ణాల‌కు పాల్ప‌డుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. చిన్న చిన్న కార‌ణాల‌కే ప్రాణాలు తీసుకుంటున్నారు. వీరు చ‌నిపోవ‌డంతో వీరినే న‌మ్ముకున్న వారి పరిస్థితి వ‌ర్ణనాతీతం. తాజాగా ఓ భ‌ర్త ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. త‌న చావుకు కారణం త‌న భార్యేన‌ని సూసైడ్ లెట‌ర్‌లో రాసి ఉరేసుకున్నాడు. ఈ సంఘటన మంగళవారం గుంటూరు జిల్లాలోని రేపల్లె మండలం రొంపిచర్లలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు రొంపిచర్లకు చెందిన ఏలికా రామకృష్ణారావు (32) కు ఈపూరు మండలం ముప్పాళ్ల గ్రామానికి చెందిన యువతితో కొంతకాలం క్రితం వివాహం జరిగింది. వీరి మ‌ధ్య త‌ర‌చూ గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. దీంతో అత‌డి భార్య ఇటీవ‌ల పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్ర‌మంలో ఆమె ఈపూరు స్టేషన్‌లో భర్త, అతని బంధువులపై కేసు పెట్టింది. దీంతో సోమ‌వారం రామ‌కృష్ణారావు, అత‌ని బంధువుల‌ను పోలీసులు ఈపూరు స్టేష‌న్‌కు పిలిపించి మాట్లాడారు. అనంతరం రాత్రి రామకృష్ణారావు, బంధువులు ఇళ్లకు వెళ్లారు.

ఇంటికి చేరుకున్న‌ రామకృష్ణారావు తన చావుకి కారణం త‌న భార్య, వారి కుటుంబ స‌భ్యులేన‌ని ఉత్త‌రం రాసి ఇంట్లో ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. తెల్లవారుజామున అతను ఉరేసుకుని ఉండటాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించిన పోలీసులు.. మృతుడి తండ్రి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story
Share it