ఫ్రిజ్‌లో 30 ముక్కలుగా మహిళ శవం.. ప్రియుడిపై భర్త అనుమానం

తన ఫ్లాట్‌లోని రిఫ్రిజిరేటర్‌లో ముక్కలు చేయబడిన బెంగళూరు మహిళ మహాలక్ష్మి యొక్క విడిపోయిన భర్త, తన భార్యకు ఒక వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని, ఆమె ప్రేమికుడే ఈ హత్య చేసి ఉండొచ్చని పేర్కొన్నాడు.

By అంజి  Published on  24 Sept 2024 9:15 AM IST
Husband , Bengaluru woman, fridge, lover, murder, Crime

ఫ్రిజ్‌లో 30 ముక్కలుగా మహిళ శవం.. ప్రియుడిపై భర్త అనుమానం

తన ఫ్లాట్‌లోని రిఫ్రిజిరేటర్‌లో ముక్కలు చేయబడిన బెంగళూరు మహిళ మహాలక్ష్మి యొక్క విడిపోయిన భర్త, తన భార్యకు ఒక వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని, ఆమె ప్రేమికుడే ఈ హత్య చేసి ఉండొచ్చని పేర్కొన్నాడు. మహాలక్ష్మి భర్త హేమంత్ దాస్ మాట్లాడుతూ.. హత్య వెనుక ఉత్తరాఖండ్‌కు చెందిన అష్రాఫ్ హస్తం ఉండవచ్చని, కొద్ది నెలల క్రితం బెంగళూరులోని స్థానిక పోలీస్ స్టేషన్‌లో అతనిపై ఫిర్యాదు కూడా నమోదైందని అన్నారు.

"అష్రఫ్ అనే వ్యక్తిని నేను అనుమానిస్తున్నాను. నేను అతనిపై ఒకసారి నెలమంగళ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసాను. ఫిర్యాదు తర్వాత, అతను బెంగళూరుకు రాకూడదని ఆదేశించబడింది. కానీ వారు ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదు" అని హేమంత్‌ దాస్‌ అన్నాడు. దాస్‌, మహాలక్ష్మి దంపతులకు ఆరు ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె ఉంది. అయితే కుటుంబ కలహాల కారణంగా తొమ్మిది నెలల క్రితం దంపతులు విడివిడిగా జీవించడం ప్రారంభించారు.

"అష్రాఫ్ ఉత్తరాఖండ్ నుండి వచ్చాడు. వివాహేతర సంబంధం గురించి తెలియడంతో మేము ఫిర్యాదు చేసాము. ఇది అనుమానం కాదు, నాకు తెలుసు. అష్రఫ్ బార్బర్ షాప్‌లో పనిచేస్తున్నాడు. నాకు 2023 ఏప్రిల్ లో ఈ వ్యవహారం తెలిసింది. 2023. అష్రఫ్ గురించి మహాలక్ష్మి నాకు ఏమీ తెలియచేయలేదు, నేను ఆమెతో నిరంతరం టచ్‌లో లేను" అని దాస్ చెప్పాడు.

మొబైల్ ఫోన్ షాప్‌లో పనిచేసే దాస్, 25-30 రోజుల క్రితం మహాలక్ష్మి దుకాణానికి వచ్చినప్పుడు ఆమెను కలిశానని చెప్పాడు. సెప్టెంబరు 22న బెంగళూరులోని వయాలికావల్ ప్రాంతంలోని ఆమె ఒక గది ఫ్లాట్‌లో మహాలక్ష్మి (29) మృతదేహాన్ని కర్ణాటక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె శరీరాన్ని 30 ముక్కలుగా చేసి రిఫ్రిజిరేటర్‌లో భద్రపరిచారు. ఈ ఘటనపై కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర మాట్లాడుతూ.. ఈ కేసులో ప్రధాన నిందితుడిని గుర్తించామని, త్వరలో అరెస్టు చేస్తామని చెప్పారు.

"ఇప్పటికే కొంత సమాచారం సేకరించబడింది, దానిని నేను ఇప్పుడు వెల్లడించలేను...కానీ అందులో ప్రమేయం ఉన్నవారిని త్వరలో పట్టుకుంటాం”అని పరమేశ్వర సోమవారం విలేకరులతో అన్నారు.

Next Story