రెండో భర్తతో వీడియో కాల్.. భార్యను కత్తితో పొడిచి చంపిన మూడో భర్త.. ఆ రాత్రంతా..
Husband kills thrice-married woman for making video call to 2nd hubby. తనను వివాహాం చేసుకుని.. రెండో భర్తతో వీడియో కాల్‌లో మాట్లాడుతోందని భార్యను అతి కిరాతకంగా చంపాడో భర్త.
By అంజి Published on 29 Dec 2022 4:08 PM ISTతనను వివాహాం చేసుకుని.. రెండో భర్తతో వీడియో కాల్‌లో మాట్లాడుతోందని భార్యను అతి కిరాతకంగా చంపాడో భర్త. భార్యను కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలోని ఘజియాబాద్‌లో జరిగిన ఈ సంఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టిన ఈ కేసులో ఇంట్రెస్టింగ్ విషయాలు వెలుగు చూశాయి. బాధిత మహిళను పోలీసులు భవ్య శర్మగా గుర్తించారు. ఆమెకు ఇది మూడో పెళ్లి. భర్తను మార్చిన ప్రతిసారీ ఆ మహిళ తన గుర్తింపును మార్చుకుంది. నిందితుడు మూడో భర్త వినోద్ శర్మ పోలీసుల విచారణలో నేరం చేసినట్లు అంగీకరించాడు.
డిసెంబర్ 26న ఘజియాబాద్‌లోని విజయ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాన్షీరామ్ కాలనీలో మృతదేహానికి సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఒక మహిళ మృతదేహాన్ని కనుగొన్నారు. ఆమె భర్త అక్కడి నుంచి కనిపించకుండా పోయాడు. తదుపరి విచారణలో వినోద్‌తో వివాహం కాకముందే భవ్యకు రెండు వివాహాలు జరిగినట్లు తేలింది. ఒకరిని పెళ్లి చేసుకున్న ప్రతిసారీ ఆమె తన గుర్తింపును మార్చుకుంది.
భవ్య తన మొదటి భర్త యోగేంద్ర కుమార్‌ను పెళ్లి చేసుకున్నప్పుడు, ఆమె తనను తాను బేబీగా పరిచయం చేసుకుంది. పెళ్లయిన వెంటనే వారిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత భవ్య తన పేరును అఫ్సానాగా మార్చుకుని అనీస్ అన్సారీని పెళ్లి చేసుకుంది. వారిద్దరికీ 16 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అనీస్ నుంచి విడిపోయిన భవ్య దాదాపు ఐదు నెలల క్రితం వినోద్‌ను పెళ్లి చేసుకుంది. బయటి వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించిన ఆనవాళ్లు కనిపించడం లేదని, అందుకే వినోద్ తమ ప్రధాన నిందితుడని పోలీసులు తెలిపారు. భవ్య వినోద్‌ను పెళ్లి చేసుకున్నప్పుడు తనతో పాటు 16 ఏళ్ల కొడుకును కూడా తీసుకెళ్లిందని పోలీసు అధికారులు తెలిపారు. ఈ కేసును విచారించిన అనంతరం బుధవారం వినోద్‌ను అరెస్టు చేశారు.
డిసెంబరు 24న భవ్య ఇండోర్‌కు వెళ్లింది. వీడియో కాల్‌లో మాట్లాడుతుండగా వినోద్.. భవ్యతో పాటు అనీస్‌ను గమనించాడు. డిసెంబర్ 25న భవ్య ఇంటికి వచ్చినప్పుడు వినోద్ భవ్య కొడుకును ఆడుకోవడానికి బయటికి పంపించాడు. వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వినోద్ భవ్యను కత్తితో పొడిచి చంపాడు. "నేరం చేసిన తరువాత, వినోద్ ఇంటిని శుభ్రం చేసి రక్తపు మరకలను తుడిచిపెట్టాడు. ఆమె మృతదేహాన్ని బెడ్‌రూమ్‌లో దాచాడు. భవ్య కొడుకు తన తల్లి గురించి ఆరా తీస్తే, ఆమె లోపల నిద్రిస్తోందని వినోద్ చెప్పాడు. వినోద్ పారవేయలేకపోయాడు. అతను రాత్రంతా మృతదేహంతోనే ఉన్నాడు. పోలీసులు ఇప్పుడు భవ్య నిజమైన గుర్తింపును కనుగొనడానికి దర్యాప్తు చేస్తున్నారు.