ప్రేమ వివాహాం.. అనుమానం పెనుభూతమై.. గర్భిణీని కాళ్లతో తొక్కి
Husband killed wife in Prakasam District.నాలుగేళ్ల క్రితం వారిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
By తోట వంశీ కుమార్ Published on 26 Feb 2021 10:15 AM ISTనాలుగేళ్ల క్రితం వారిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే.. కొద్ది రోజుల క్రితం భర్త పొలం పనికి వెళ్లి తిరిగివస్తుండగా.. ఇంట్లోంచి ఓ వ్యక్తి బయటకు వెళ్లడాన్ని గమనించాడు. ఆ సమయంలో ఇంట్లో భార్య ఒక్కతే ఉండడంతో అతడికి అనుమానం వచ్చింది. ఈ విషయమై భార్యను అడగగా.. తనకు ఏమీ తెలియదని చెప్పింది. అప్పటి నుంచి భార్యను వేదించడం మొదలుపెట్టాడు. గర్భిణి అన్న కనికరం కూడా లేకుండా తన తండ్రి సాయంతో బార్య ప్రాణాలు తీసి ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు.
వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పెద్ద ఉల్లగల్లు గ్రామానికి చెందిన కొండవీటి శ్రీనివాసులు గుంటూరు జిల్లా చిలకలూరి పేటకు చెందిన శైలజ నాలుగేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ఓ కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం శైలజ మూడు నెలల గర్భిణి. నెల రోజుల క్రితం శ్రీనివాసులు పొలం నుంచి తిరిగొస్తుండగా ఇంటికి కొద్ది దూరంలో ఉండగా.. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోంచి వచ్చినట్లు కనిపించింది. ఆ సమయంలో భార్య ఒక్కతే ఇంట్లో ఉండడంతో.. ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై శైలజను అడుగగా.. అలాంటిదేమీ లేదని చెప్పి వాపోయింది.
అయినప్పటికి శ్రీనివాసులు భార్యపై అనుమానం పెంచుకుని శారీరకంగా హింసించేశాడు. ఈ క్రమంలో ఈ నెల 20న అర్థరాత్రి ఇంట్లో నిద్రపోతున్న శైలజ మెడపై కాలితో తొక్కి హత్య చేశాడు. తరువాత తండ్రి సాయంతో పశువుల పాకలోకి తీసుకువెళ్లి చీరతో ఉరివేసుకుని చనిపోయినట్లుగా అందరిని నమ్మించే ప్రయత్నం చేశాడు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో శ్రీనివాసులు, గురులింగం.. ముండ్లమూరు తహసీల్దార్ దగ్గర లొంగిపోయారు. తానే హత్య చేసినట్లు శ్రీనివాసులు అంగీకరించాడు. అందుకు తండ్రి సాయం చేశాడని చెప్పాడు.