భార్యని చంపాడని 6 నెలలుగా జైల్లో భర్త.. ఆమె క్షేమంగా ఉందని తెలియడంతో..
Husband jailed for 6 months for killing his wife.. Knowing that she is safe.. భార్యను హత్య చేసిన కేసులో ఓ యువకుడు గత ఆరు నెలలుగా జైలులో ఉన్నాడు. అయితే అతని భార్య పుట్టింట్లో క్షేమంగా
By అంజి Published on 9 Sept 2022 5:40 PM ISTభార్యను హత్య చేసిన కేసులో ఓ యువకుడు గత ఆరు నెలలుగా జైలులో ఉన్నాడు. అయితే అతని భార్య పుట్టింట్లో క్షేమంగా ఉందని దర్యాప్తులో తేలడంతో పోలీసులు ఒకింత షాక్‌కు గురయ్యాడు. ఈ కేసులో విచారణ లేకుండానే యువకుడిని జైలుకు పంపిన పోలీసులు.. ఇప్పుడు భార్య, ఆమె తల్లీ బంధువులను విచారిస్తున్నారు. ఈ ఘటన బిహార్‌లోని సీతామఢీ జిల్లా చోరౌత్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ కేసు జోగియా గ్రామానికి చెందినది. గ్రామానికి చెందిన శశికుమార్‌కు, నేపాల్ యువతి హీరాదేవితో పెళ్లైంది. వారికి ఏడాది కొడుకు ఉన్నాడు.
అయితే హీరాదేవి 7 నెలల క్రితం అదృష్యమైంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది మార్చి 23న అరుణ్ కుమార్ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. నిజానికి ఆ యువకుడిపై అత్తమామలు కేసు పెట్టారు. కట్నం కోసం యువకుడు తన భార్యను హత్య చేసి మృతదేహాన్ని కూడా అదృశ్యం చేశాడని అత్తమామలు ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎలాంటి విచారణ లేకుండానే యువకుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. మరోవైపు తప్పుడు కేసుతో యువకుడి కుటుంబ సభ్యులు ఉలిక్కిపడ్డారు.
తన భార్య స్వయంగా ఇంటిని వదిలి వెళ్లిపోయిందని భర్త చెప్పాడు. అయినా జైలుకు పంపారు. ఆ తర్వాత జైలుకు వెళ్లిన యువకుడి బంధువులు ఆ మహిళ గురించి ఆరా తీశారు. ఇంతలో, ఆ మహిళ ఇప్పటికీ నేపాల్‌లోని తన తల్లి ఇంటిలో నివసిస్తోందని తెలిసింది. దీంతో యువకుడి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి మహిళను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఆమెను స్థానిక కోర్టులో హాజరుపరిచారు. అక్కడ ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు.
ఈ విషయానికి సంబంధించి పోలీస్ స్టేషన్ ప్రెసిడెంట్ జితేంద్ర కుమార్ సింగ్ మాట్లాడుతూ.. స్థానిక నివాసి అయిన శశికుమార్ తన భార్య హీరా దేవిని హత్య చేసిన కేసులో జైలులో ఉన్నాడు. తన అల్లుడు శశికుమార్, అతని సోదరుడు సంజయ్ మహతో, అత్తగారు సుమిత్రా దేవి కట్నం కోసం కూతురిని హత్య చేశారని మహిళ తండ్రి ఆరోపించారు. ఫిర్యాదు మేరకు నిందితుడు భర్త శశికుమార్‌ను 6 నెలల క్రితం అరెస్టు చేశారు. అయితే పోలీసుల విచారణలో ఆమె బతికే ఉందని పోలీసులకు తెలియడంతో అందరూ ఆశ్చర్యపోయారు. హీరా కుమారి నేపాల్‌లోని తన తల్లి ఇంట్లో క్షేమంగా ఉంది. శశికుమార్ తాజాగా పోలీసులు విడుదల చేశారు.