అదనపు కట్నం తేకుంటే.. ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడతా
Husband harassing wife for dowry in Hyderabad.ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అదనపు కట్నం కావాలని భార్యను
By తోట వంశీ కుమార్ Published on 4 Sept 2021 8:39 AM IST
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అదనపు కట్నం కావాలని భార్యను వేదించసాగాడు. వారిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో తీసుకున్న ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో బెడతానని వేదింపులకు గురి చేశాడు. ఇందుకు అత్త మామలు వంత పాడారు. వీరి వేదింపులు రోజు రోజుకు తీవ్రం అవుతుండడంతో ఆ ఇల్లాలు.. చివరకు పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన బంజారాహిల్స్‌లో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు..బంజారాహిల్స్ రోడ్ నెం. 11లో ఓ యువతి (24) నివసిస్తోంది. ఆమె 2016లో ఎంబీఏ పూర్తి చేసింది. అనంతరం ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో చేరింది. ఆ సమయంలో సికింద్రాబాద్‌లోని గన్‌రాక్ ఎన్‌క్లేవ్‌కు చెందిన మహ్మద్ ఫర్హాన్(26)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇరు కుటుంబాలను ఒప్పించి 2017లో వీరిద్దరు వివాహం చేసుకున్నారు. పెళ్లిని ఎంతో ఘనంగా చేశాడు ఆ యువతి. అందుకు దాదాపు కోటిన్నర పైగా ఖర్చుపెట్టాడు. మరో కోటిన్నర విలువ చేసే బంగారు ఆభరణాలు, నగదు కట్నంగా ఇచ్చాడు.
పెళ్లైన కొత్తలో బాగానే ఉన్నప్పటికి క్రమంగా వారి నిజస్వరూపం బయటపడింది. నగలను భద్రపరుస్తామంటూ ఆ యువతి నుంచి నగలు తీసుకుంది అత్త ఒస్మాన్. ఏదైన శుభాకార్యానికి వెళ్లేప్పుడు నగలు కావాలని కోడలు అడిగినప్పటికి ఇచ్చేది కాదు. పిల్లలు లేరని అత్తమామలు వేదించేవారు. అదనపు కట్నం తేవాలంటూ వేదించేవారు. నగదు తేకుంటే.. ఏకాంత ఉన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడతానంటూ భర్త బ్లాక్‌మెయిల్‌కు దిగాడు. కొన్ని సార్లు తీవ్రంగా కొట్టాడు. వీరి వేదింపులు అధికం కావడంతో గురువారం రాత్రి బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీనిపై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు .. భర్త ఫర్హాన్ తో పాటు అత్తమామలు ఆయేషా ఉస్మాన్, మహ్మద్ ఒస్మాన్ లపై వరకట్నం, వేదింపుల కింద కేసులు నమోదు చేశారు.