దారుణం.. అనుమానంతో భార్యను నరికి చంపిన భర్త

Husband hacked his wife to death in mahabubabad district. భార్యను భర్త దారుణంగా నరికి చంపాడు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం తానంచర్ల శివారు ఆనకట్ట

By అంజి  Published on  26 July 2022 8:11 AM GMT
దారుణం.. అనుమానంతో భార్యను నరికి చంపిన భర్త

అనుమానం పెనుభూతం లాంటిది. ఎలాంటి భూతం పట్టినా వదిలించవచ్చు గానీ, అనుమానం పట్టుకుంటే మాత్రం వదిలించడం అసాధ్యం. అనుమానం వల్ల మానవ సంబంధాలు దెబ్బతినడమే కాదు, మనశ్శాంతి కూడా కరువవుతుంది. కొందరైతే అనుమానంతో దారుణాలకు తెగిస్తున్నారు. తాజాగా అనుమానంతో భార్యను భర్త దారుణంగా నరికి చంపాడు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం తానంచర్ల శివారు ఆనకట్ట తండాలో తెల్లవారు జామున చోటు చేసుకుంది.

తెలిసిన వివరాల ప్రకారం.. ఆనకట్ట తండాకు చెందిన బానోత్‌ రవి, మమతలకు ఆరేళ్ల కిందట పెళ్లి జరిగింది. భార్య మమతను భర్త రవి నిత్యం అనుమానిస్తుండేవాడని, వేధింపులకు గురి చేసేవాడని బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే అనుమానంతో ఇవాళ తెల్లవారుజామున భార్యను భర్త రవి గొడ్డలితో నరికి చంపేశాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న బాధితురాలి బంధువులు నిందితుడు రవి ఇంటిని తగుల బెట్టి, వస్తువులన్నీ ధ్వంసం చేశారు.

మృతదేహాన్ని తరలిస్తుండగా ఆందోళన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story