భార్య కోసం ఖ‌రీదైన ఫోన్ కొన్న భ‌ర్త‌.. అత‌డి ముందే ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డిన మ‌హిళ‌

Husband Gifts expensive phone to wife she commits suicide for this weird reason.భార్య‌పై ఉన్న ప్రేమ‌తో ఫోన్ కొని గిఫ్ట్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Oct 2022 11:33 AM IST
భార్య కోసం ఖ‌రీదైన ఫోన్ కొన్న భ‌ర్త‌.. అత‌డి ముందే ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డిన మ‌హిళ‌

భార్య‌పై ఉన్న అమిత‌మైన ప్రేమ‌తో ఖ‌రీదైన ఫోన్ కొని గిఫ్ట్‌గా ఇచ్చాడు ఓ భ‌ర్త‌. ఆ ఫోన్ చూసి భార్య ఎగిరి గంతులేస్తుంద‌ని ఆశ ప‌డ్డాడు. భ‌ర్త‌కు త‌న‌పై ఉన్న ప్రేమ చూసి సంతోష‌ప‌డాల్సిన ఆమె అత‌డి ఎదురుగానే ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. ఈ ఘ‌ట‌న ఒడిశాలోని మ‌ల్కాన్‌గిరి జిల్లాలో చోటు చేసుకుంది.

వివ‌రాలు ఇలా ఉన్నాయి.. జ్యోతి మండల్‌, కన్హైలకు సంవ‌త్స‌రం క్రితం పెళ్లైంది. ఎంపీవీ 14 గ్రామంలో నివాసం ఉంటున్నారు. దంప‌తులు ఇద్ద‌రూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ జీవ‌నం సాగిస్తున్నారు. అయితే.. వీరి కాపురంలో ఓ ఫోన్‌ చిచ్చుపెట్టింది. ఎంతో ఇష్టంగా భార్య‌కు ఓ ఖ‌రీదైన ఫోన్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. అయితే.. అంత మొత్తాన్ని ఒకే సారి చెల్లించ‌డం వీలుకాక పోవ‌డంతో ఈఎంఐ ప‌ద్ద‌తిలో బుక్ చేసుకున్నాడు. ఈ విష‌యం అత‌డి భార్య‌కు తెలియ‌దు.

ఇటీవ‌ల ఆ ఫోన్ ఈఎంఐ ముగిసింది. ఫైనాన్స్ కంపెనీకి చెందిన అధికారులు కన్హై సంతకం కోసం వారి ఇంటికి వ‌చ్చారు. దీంతో విష‌యం తెలుసుకున్న ఆమె మ‌న‌స్తాపానికి గురైంది. ఈ విష‌య‌మై దంప‌తుల మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. దీంతో మాటా పెర‌గ‌డంతో ఆవేశంలో జ్యోతి మండ‌ల్ త‌న భ‌ర్త కన్హై ముందే పురుగుల మందు తాగింది.

ఈ అనుకోని ప‌రిణామానికి షాక్‌కు గురైన కన్హై స్పృహ త‌ప్పి ప‌డిపోయాడు. చుట్టుప‌క్క‌ల వారు ఇద్ద‌రిని ఆస్ప‌త్రికి తీసుకువెళ్లారు. చికిత్స పొందుతూ జ్యోతి మ‌ర‌ణించింది. ఈ ఘ‌ట‌న ఎవ‌రూ ఫిర్యాదు చేయ‌న‌ప్ప‌టికీ సుమోటోగా కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story