కీచక భర్త.. అలా చేయాలంటూ వేధింపులు.. వీడియోలు తీసి
Husband forced me to sleep with friends.భార్యను స్నేహితులతో పడుకోవాలని బలవంతం చేశాడు.
By తోట వంశీ కుమార్ Published on 10 Dec 2022 1:07 PM ISTకడదాక తోడుంటానని, ఏ కష్టం రాకుండా చూసుకుంటానని మాట ఇచ్చాడు. అతడి మాటలను నమ్మి, తాను కోరుకున్న మంచి భాగస్వామి దొరికాడని సంతోషంగా పెళ్లి చేసుకుంది. అయితే.. పెళ్లైన కొద్దిరోజులకు అతడి నిజస్వరూపం బయటపడింది. మత్తు పదార్థాలకు, మద్యానికి బానిసైన అతడు భార్యను స్నేహితులతో పడుకోవాలని బలవంతం చేశాడు. ఆనక ఆ దృశ్యాలను వీడియో తీశాడు. అతడి వేధింపులు తీవ్రతరం అవుతుండడంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయిచింది. ఈ ఘటన బెంగళూరులో జరిగింది.
సంపిగేహళ్లికి చెందిన ఓ మహిళ(36)కు 2011లో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు సంతానం. దంపతులు ఇద్దరూ సాఫ్ట్‌వేరు ఉద్యోగులే. తొలి నాళ్లలో వీరి సంసార జీవితం సాఫీగానే సాగింది. అయితే.. అతడు మత్తు పదార్థాలకు మద్యానికి బానిస అయ్యాడు. అందినకాడికి అప్పులు చేశాడు. ఇదీ చాలదు అన్నట్లు తన స్నేహితులో శృంగారంలో పాల్గొనాలని ఒత్తిడి చేశాడు. అతడి మాటను కాదనందుకు ఇష్టం వచ్చినట్లు కొట్టేవాడు.
అతడి దెబ్బలకు తాళలేక ఆమె భర్త చెప్పిన పనికి ఒప్పుకుంది. అతడి ఇద్దరు స్నేహితులతో శృంగారంలో పాల్గొంది. దీన్ని అతడు వీడియో తీశాడు. పదే పదే తన స్నేహితులకు సుఖం అందించాలని వేధించేవాడు. అతడు మారకపోగా.. వేధింపులు అధికం అవుతుండడంతో విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకుంది. అయితే.. తన వద్ద వీడియోలను చూపిస్తూ విడాకులు ఇస్తే ఆ వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానని బెదిరించసాగాడు.
దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించి అతడిపై ఫిర్యాదు చేసింది. ఆమె సోదరిని కూడా బలవంతం చేశాడని ఫిర్యాదులో ఆమె పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.