దారుణం.. కట్నం కోసం భార్య కాళ్లు, చేతులు విరగ్గొట్టిన భర్త
Husband Breaks Wife Hands And Feet For Dowry Woman Pleaded With CM Shivraj. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ నగరంలో దారుణ ఘటన వెలుగు చూసింది. 25 వేల రూపాయల కోసం
By అంజి Published on 19 Oct 2022 6:58 AM GMTమధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ నగరంలో దారుణ ఘటన వెలుగు చూసింది. 25 వేల రూపాయల కోసం మహిళను కొట్టి చేతులు, కాళ్లు విరగ్గొట్టాడు భర్త. మహిళ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయడంతో, పోలీసులు చిన్న సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి నేరస్థుడిని విడుదల చేశారు. ఆ తర్వాత, 30 ఏళ్ల బాధితురాలు లక్ష్మి మంగళవారం పోలీసుల పబ్లిక్ హియరింగ్‌కు వెళ్లింది. ఆ సమయంలో మహిళ చేతులు, కాళ్ళకు కట్లు కట్టి ఉన్నాయి. మహిళ తన భర్త వేధింపులపై అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. అలాగే సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు కూడా ఇదే విషయమై ఆమె విజ్ఞప్తి చేశారు. వరకట్నం కోసం మహిళలు ఎంతకాలం ఇలా బాధింపబడతారని, ఇంకా ఎంతకాలం చనిపోతారని ఆమె ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.
బాధితురాలు లక్ష్మి మాట్లాడుతూ.. ''నేను జనక్‌గంజ్‌లోని జివాజిగంజ్ సత్యనారాయణ టేక్రిలో నివసిస్తున్నాను. నాకు 12 ఏళ్ల క్రితం ఛోటూ బాథమ్‌తో వివాహమైంది. పెళ్లి సమయంలో తండ్రి బంగారు, వెండి నగలు, గృహోపకరణాలు సహా లక్ష రూపాయలు కట్నంగా ఇచ్చాడని, ఇది జరిగిన తర్వాత కూడా చాలా ఏళ్లుగా భర్త నన్ను రోజూ కొడుతున్నాడు. నన్ను మానసికంగా హింసిస్తున్నాడు. అక్టోబర్ 3న మా నాన్న ఇంటి నుంచి 25 వేలు తీసుకురావాలని భర్త ఒత్తిడి చేశాడు. డబ్బు కోసం పదే పదే డిమాండ్ చేయడంతో కలత చెందాను. దీన్ని నేను వ్యతిరేకించడంతో కట్నం కోసం కన్న భర్త నన్ను కర్రలు, రాడ్లతో కొట్టాడు. తలకు బలమైన గాయమై చేతులు, కాళ్లు విరిగిపోయాయి.'' అని చెప్పారు.
తన భర్త తనను నిర్దాక్షిణ్యంగా కొట్టినప్పుడు తన కుటుంబ సభ్యులు అతనిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని లక్ష్మి చెప్పింది. తప్పుడు ప్రచారం చేయడంతో పోలీసులు చిన్నపాటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతను తనను నిరంతరం ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. తీవ్ర గాయాలపాలై చాలా రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాను. ''నేను నిస్సహాయంగా ఉన్నాను మా నాన్న నన్ను ఎస్పీ కార్యాలయానికి తీసుకువచ్చారు. నా భర్తపై, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు, సీఎంకు నా విన్నపం. అదే సమయంలో, ఈ కేసులో పోలీసులు ఉద్దేశపూర్వకంగా చర్యలు తీసుకోవడం లేదు'' అని లక్ష్మి తండ్రి చెప్పారు.