హారతి ఆరిపోయింది.. ఆయుష్ష తీరిందని.. గృహిణి ఆత్మహత్య
House Wife suicide in BanjaraHills.ఆ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు.
By తోట వంశీ కుమార్ Published on 5 Aug 2021 8:54 AM ISTఆ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. అయితే.. భర్తతో చిన్న గొడవ. ఈ క్రమంలో దేవుడికి హారతి ఇస్తుండగా మధ్యలోనే హారతి ఆరిపోయింది. నుదుట కుంకుమ పెట్టుకోవాలని బావించగా.. కుంకుమ భరణి చేజారింది. ఇవి అపశకునాలని బావించింది. తన ఆయుష్షు మూడిందని ఆమె బావించింది. సెల్పీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్‌కు చెందిన ఓంప్రకాశ్, కబిత(23) లు ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి నాలుగేళ్ల కూతురు ఉంది. వీరు జూబ్లీహిల్స్ రోడ్ నెం.78లోని పద్మాలయ అంబేడ్కర్‌నగర్ బస్తీలో అద్దెకుంటున్నారు. ఓంప్రకాశ్ కాపలాదారుడి పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం భార్యాభర్తల మధ్య చిన్న గొడవ జరిగింది. తన కుమారైను తీసుకుని ఓంప్రకాశ్ పనికి వెళ్లాడు. రాత్రి 7.30గంటలకు పని ముగించుకుని ఇంటికి వచ్చాడు. అయితే.. ఎంతసేపటికి తన భార్య తలుపుతీయక పోవడంతో అతడికి అనుమానం వచ్చింది.
కిటిలోంచి చూడగా.. కబిత ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. దీంతో ఇంటి యజమాని సాయంతో తలుపు బద్దలు కొట్టి లోనికి వెళ్లాడు. అయితే.. అప్పటికే ఆమె మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. తమ మధ్య చిన్నపాటి గొడవ జరిగిందని..అంతకు మించి ఏమీ లేదని ఓంప్రకాశ్ పోలీసులకు తెలిపాడు. కబిత సెల్‌ఫోన్ పరిశీలించగా.. సెల్పీ వీడియోలు గుర్తించారు. హారతి ఆరిపోవడాన్ని, కుంకుమ భరణి కిందపడిపోవడాన్ని కబిత సెల్పీ వీడియోలో చెప్పుకొచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.