మానవ సంబంధాలు మంట గలసిపోతున్నాయి. క్షణికావేశం ప్రాణాలను తీస్తోంది. నిండూ నూరేళ్లు కలిసుండాల్సిన దంపతులు పోట్లాడుకుంటున్నారు. చివరకు ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి తన భార్యను చంపి వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాడు. ఈ దారుణ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా సీతారాంపురంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
బాలాజీ రామాచారి అనే వ్యక్తి తన భార్య సంధ్య (42)ను హత్య చేసి వీడియో తీసి వాట్సాప్‌లో స్టేటస్ పెట్టుకున్నాడు. భార్య, కూతురు వేధింపులు తాళలేకనే అతడు ఈ దారుణానికి ఒడిగట్టినట్టు చెప్పాడు. అనంతరం తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మొదటి భార్య మరణించాక అతను సంధ్యను రెండో వివాహం చేసుకున్నాడని స్థానికులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. నిన్న సంగారెడ్డి జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. భార్యను తనతో పాటు పంపడం లేదని ఓ వ్యక్తి ఆగ్రహంతో ఊగిపోతూ తన మామను కత్తితో పొడిచి అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా జనాలను భయభ్రాంతులకు గురి చేసింది. సంగారెడ్డి జిల్లాలోని ఆమీన్‌పూర్ పరిధిలోని బీరంగూడలో నివాసముంటున్న చంద్రయ్య.. తన కూతురు లక్ష్మిని రామకృష్ణ అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. అయితే రామకృష్ణ మద్యానికి బానిసయ్యాడు.