తెలంగాణలో పరువు హత్య కలకలం.. మహిళా కానిస్టేబుల్‌ను నరికి చంపిన తమ్ముడు!

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పరువు హత్య కలకలం రేపింది. హయత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నాగమణిని సొంత సోదరుడు పరమేశ్‌ దారుణంగా హత్య చేశాడు.

By అంజి  Published on  2 Dec 2024 11:24 AM IST
Honor killing, Ranga Reddy district, woman constable, Crime

తెలంగాణలో పరువు హత్య కలకలం.. మహిళా కానిస్టేబుల్‌ను నరికి చంపిన తమ్ముడు!

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పరువు హత్య కలకలం రేపింది. హయత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నాగమణిని సొంత సోదరుడు పరమేశ్‌ దారుణంగా హత్య చేశాడు. ఇటీవల కానిస్టేబుల్‌ నాగమణి, రాయపోల్ ప్రాంతానికి చెందిన శ్రీకాంత్‌ ప్రేమ వివాహం చేసుకున్నారు. నవంబర్‌ ఒకటో తేదీన వీరి వివాహం యాదగిరిగుట్టలో జరిగింది. వివాహం అనంతరం హయత్ నగర్ లో దంపతులు నివాసం ఉంటున్నారు.

ప్రేమించి, పెళ్లి చేసుకోవడంతో కుటుంబ సభ్యులు నాగమణిపై ఆగ్రహంతో ఉన్నారు. నిన్న సెలవు కావడంతో నాగమణి తన సొంత గ్రామానికి వెళ్ళింది. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం డ్యూటీకి వెళ్లొస్తున్న నాగమణిని రాయపోలు - మన్నెగూడ మార్గంలో పరమేశ్‌ కారుతో ఢీకొట్టాడు. అనంతరం ఆమెను కత్తితో నరికి చంపాడు.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్య చేసిన పరమేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Next Story