హోమ్ గార్డ్ భ‌ర్త చేతిలో హ‌త్య‌కు గురైన భార్య‌

Home Guard Wife Died Due To Gun Misfire. గొల్లపూడిలో తుపాకీ మిస్ ఫైర్ అవ‌డంతో హోమ్ గార్డ్ భార్య మృతి చెందింది.

By Medi Samrat  Published on  12 April 2021 4:59 AM GMT
Gun misfire

గొల్లపూడిలో హోమ్ గార్డ్ భార్య.. భ‌ర్త చేతిలో దారుణ హ‌త్య‌కు గురైంది. వివ‌రాళ్లోకెళితే.. హోమ్ గార్డ్ వినోద్.. సీఎం సెక్యురిటి వింగ్ ఏఎస్పీ వద్ద అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఏఎస్పీ మూడు రోజుల క్రితం క్యాంప్ నిమిత్తం అనంతపురం వెళ్లారు. దీంతో హోమ్ గార్డ్ వినోద్ ఏఎస్పీ కారులో ఉన్న తుపాకీని త‌న వెంట ఇంటికి తీసుకెళ్లాడు

అయితే.. అర్ధ‌ రాత్రి భార్యకు వినోద్‌కు బంగారు న‌గ‌ల విష‌య‌మై గొడ‌వ జ‌రిగింది. క్ష‌ణికావేశంలో‌ వినోద్‌ భార్య సూర్యరత్న ప్రభ మీద‌కు కాల్పులు జ‌రిపాడు. దీంతో బులెట్ గుండెల్లోకి దూసుకెళ్లింది. దీంతో హోమ్ గార్డ్ భార్య అక్క‌డిక‌క్క‌డే మృతి చెందింది. ఈ ఘ‌ట‌న తెల్లవారుజామున 2 గంటల సమయంలో జ‌రిగింది. ఘటనపై కేసు నమోదు చేసిన భవానీపురం పోలీసులు‌ దర్యాప్తు చేస్తున్నారు.Next Story