హిమాచల్ ప్రదేశ్‌లోని కులు జిల్లా ష్వాద్‌లోని షకేల్డ్ సమీపంలో ప్రైవేట్ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. బస్సు ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానిక ప్రజల సహాయంతో అధికార బృందం క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
సమాచారం ప్రకారం.. NPT ప్రైవేట్ బస్సు కర్సోగ్ రహదారిపై షాకేల్డ్ వైపు వస్తోంది. ష్వాద్ సమీపంలోకి రాగానే.. డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతో బస్సు రోడ్డుపై నుంచి 200 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తున్నారు.