అమృత్‌సర్‌లోని ఇంటిగ్రేటెడ్ చెక్‌పాయింట్‌లో 4,000 ఆఫ్ఘన్ చీపుర్లలో అక్రమంగా తరలిస్తున్న దాదాపు 40 కోట్ల విలువైన హెరాయిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ స్మగ్లింగ్ లో లింక్స్ ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) 5.48 కిలోల హెరాయిన్ ను స్వాధీనం చేసుకుంది. 442 వెదురు ముక్కలను హెరాయిన్‌తో నింపి సీలు చేసినట్లు అధికారులు తెలిపారు. వెదురు కర్రలకు చివర ఇనుప తీగలతో కట్టివేసారు. చీపుర్లను ఒక ఆఫ్ఘన్ జాతీయుడు, నకిలీ భారతీయ IDతో దిగుమతి చేసుకున్నారని అధికారులు తెలిపారు.
నిర్దిష్ట ఇంటెలిజెన్స్ ఆధారంగా, అమృత్‌సర్‌లోని అట్టారిలోని ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్ వద్ద DRI అధికారులు సరుకును పట్టుకున్నారు. నార్కోటిక్-డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డిపిఎస్) చట్టం, 1985 కింద ఆ వ్యక్తిని, అతని భార్యను అరెస్టు చేశారు.