రాజస్థాన్‌లోని జైపూర్‌లో తల లేని వ్యక్తి మృతదేహం కనిపించడం కలకలం రేపింది. నగరంలోని ఓ ఫామ్‌హౌస్‌లో గత మూడు రోజులుగా కనిపించకుండా పోయిన తల లేని వ్యక్తి మృతదేహం శనివారం లభ్యమైందని పోలీసులు తెలిపారు. మృతుడిని రాంపూర్ దేవలియా నివాసి శ్రావణ్ ప్రజాపత్‌గా గుర్తించామని, మూడు, నాలుగు రోజులుగా అతని ఆచూకీ తెలియలేదని అధికారులు తెలిపారు. దుర్వాసన వస్తుండటంతో స్థానికులు ఆ ప్రాంతాన్ని పరిశీలించగా కుళ్ళిపోయిన మృతదేహం కనిపించింది.
అనంతరం పోలీసులకు సమాచారం అందింది. ఫోరెన్సిక్ బృందాలు, డాగ్ స్క్వాడ్‌ల సమన్వయంతో దర్యాప్తు ప్రారంభించబడింది. పోలీసులు చుట్టుపక్కల నివాసితుల నుండి స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేయడం ప్రారంభించారని, ఆ ప్రాంతం నుండి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారని అధికారులు తెలిపారు. హత్య సహా అన్ని కోణాల నుండి కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శ్రావణ్‌ను ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనే కోణాల్లో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.