హెడ్‌కానిసేబ్టుల్ భార్య ఆత్మహత్య,. 'నా భర్త సైకో, ఎప్పుడు ప్రేమగా చూడలేదు'
Head Constable wife commits suicide in Mancherial District.ప్రాణంగా చూసుకోవాల్సిన భార్యను నిత్యం అనుమానిస్తూ
By తోట వంశీ కుమార్ Published on 29 Nov 2022 2:46 AM GMTభరించేవాడిని భర్త అని అంటారు. ప్రాణంగా చూసుకోవాల్సిన భార్యను నిత్యం అనుమానిస్తూ వేధించేవాడు. ఏదో ఒక రోజు అతడు మారుతాడేమోనని ఎంతో ఆశగా ఎదురుచూసింది. అయితే.. అతడి వేధింపులు రోజు రోజుకి అధికం అవుతుండడంతో భరించలేకపోయింది. కన్నవారికి భారం కావద్దు అనుకుని ఆత్మహత్యకు పాల్పడింది. "నా భర్త ఒక సైకో. ఎప్పుడూ ప్రేమగా చూడలేదు. బయటికి వెళ్తే అనుమానించేవాడు. అతడి వేధింపులతో మానసిక క్షోభకు గురయ్యా. అందుకే చనిపోతున్నా. అమ్మా, నాన్న, పిల్లలు క్షమించండి. పిల్లలను అతడికి అప్పగించకండి." అని సూసైడ్ నోటులో రాసింది. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నూరు మండలం సుద్దాల గ్రామానికి చెందిన కిష్టయ్యకు నస్పూర్‌కు చెందిన వనిత(35) తో 15 సంవత్సరాల క్రితం వివాహమైంది. కిష్టయ్య హెడ్‌కానిస్టేబుల్‌గా పని చేస్తూ నాగార్జున కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమారైలు, కుమారుడు ఉన్నాడు. అయితే.. భార్యపై అనుమానం పెంచుకున్న కిష్టయ్య నిత్యం ఆమెను వేదించేవాడు. దీంతో వనిత భరించలేకపోయింది. సోమవారం ఉదయం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
మధ్యాహ్నాం ఇంటికి వచ్చిన భర్త ఆమె ఉరేసుకుని కనిపించడంతో ఇరుపొరుగు వారికి విషయం చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు. విషయం తెలుసుకున్న వనిత తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని విగతజీవిగా ఉన్న కుమార్తె ను చూసి గుండెలవిసేలా రోదించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.