హోటల్‌లో దారుణం.. మహిళను చంపి, డెడ్‌బాడీని బ్యాగ్‌లో పెట్టుకుని..

హర్యానాకు చెందిన ఓ వ్యక్తి మనాలిలోని ఓ హోటల్‌లో ఓ మహిళను హత్య చేసి, ఆమె మృతదేహాన్ని బ్యాగ్‌లో పెట్టుకున్నాడని పోలీసులు శుక్రవారం తెలిపారు.

By అంజి  Published on  17 May 2024 5:12 PM IST
Haryana, Man Kills Woman, Manali Hotel, Crime

హోటల్‌లో దారుణం.. మహిళను చంపి, డెడ్‌బాడీని బ్యాగ్‌లో పెట్టుకుని..

హర్యానాకు చెందిన ఓ వ్యక్తి మనాలిలోని ఓ హోటల్‌లో ఓ మహిళను హత్య చేసి, ఆమె మృతదేహాన్ని బ్యాగ్‌లో పెట్టుకున్నాడని పోలీసులు శుక్రవారం తెలిపారు. సదరు వ్యక్తి ట్యాక్సీలో బ్యాగ్‌ని వదిలేసి వెళ్లగా మహిళ మృతదేహం లభ్యమైంది. మే 13న హర్యానాకు చెందిన వినోద్, మధ్యప్రదేశ్‌కు చెందిన శీతల్‌తో కలిసి గొంపా రోడ్డులోని ఓ హోటల్‌లోకి దిగాడు. ఈ జంట రెండు రోజులకు గదిని బుక్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

రెండు రోజుల తర్వాత వినోద్ ఒంటరిగా గది నుండి బయటికి వచ్చి బస్టాండ్‌కి వెళ్లడానికి టాక్సీ బుక్ చేసుకున్నాడు. శీతల్ ఎక్కడా కనిపించకపోవడాన్ని గమనించిన హోటల్ సిబ్బంది వినోద్ తన వెంట బరువైన బ్యాగును తీసుకెళ్లడాన్ని చూశారు. అనుమానాస్పద బ్యాగ్‌పై సిబ్బంది పోలీసులకు సమాచారం అందించగా వినోద్ సంభాషణ విన్నాడు. అతను ట్యాక్సీలో బ్యాగ్‌ను వదిలి అక్కడి నుంచి పారిపోయాడని పోలీసులు తెలిపారు.

పోలీసులు వచ్చి చూడగా బ్యాగ్ తెరిచి చూడగా లోపల శీతల్ మృతదేహం కనిపించింది. పోలీసు బృందాలు నిందితుడి కోసం వెతకడం ప్రారంభించాయి. అదే రోజు రాత్రి అతన్ని అరెస్టు చేశారు. ప్రాథమిక విచారణలో బాధితురాలి పేరుతో బుకింగ్ జరిగినందున నిందితుడి ఫోటోలు లేదా పత్రాలు పోలీసులకు లభించలేదు. అతను మహిళను ఎందుకు చంపాడు, ఇద్దరి మధ్య సంబంధం ఏమిటి అనే దానిపై పోలీసులు ఇప్పుడు అతనిని విచారిస్తున్నారు. మహిళ కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

Next Story