ఖాళీ ప్లాట్‌లో అర్ధ‌న‌గ్నంగా మ‌హిళ మృతదేహం లభ్యం

Half-naked body of woman found in Gurugram. హర్యానాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఖాళీగా ఉన్న ఓ ప్లాట్‌లో అర్ధనగ్నంగా మహిళ మృతదేహం

By అంజి  Published on  2 Sept 2022 4:01 PM IST
ఖాళీ ప్లాట్‌లో అర్ధ‌న‌గ్నంగా మ‌హిళ మృతదేహం లభ్యం

హర్యానాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఖాళీగా ఉన్న ఓ ప్లాట్‌లో అర్ధనగ్నంగా మహిళ మృతదేహం లభ్యమైంది. మహిళ మృతదేహం గురుగ్రాంలోని నధుపూర్‌ ప్రాంతంలో శుక్రవారం కనిపించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మ‌హిళ మృత‌దేహాన్ని చూసిన స్ధానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. గుర్తుతెలియ‌ని మ‌హిళ మృత‌దేహాన్ని పోస్టుమార్టానికి త‌ర‌లించిన పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మహిళ ఎవరనేది ఇంకా తెలియరాలేదు. మ‌హిళ‌పై లైంగిక దాడికి పాల్ప‌డి హ‌త్య చేసి ఉంటార‌ని అనుమానిస్తున్నారు.

గురుగ్రామ్‌లోని నాథుపూర్ ప్రాంతంలో ఉన్న ఖాళీ స్థలంలో అర్ధనగ్నంగా పడి ఉన్న మృతదేహాన్ని బాటసారులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. గురుగ్రామ్ పోలీసు సీనియర్ అధికారులు, ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాధితురాలిని గొంతు కోసి చంపినట్లు తెలుస్తోంది. ఆమె మృతదేహం పాక్షిక నగ్న స్థితిలో కనిపించింది. ''మేము మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపాము. బాధితురాలి పోస్ట్‌మార్టం జరిగిన తర్వాత మాత్రమే అత్యాచారం జరిగిందా లేదా అనేది నిర్ధారించబడుతుంది.'' అని ఏసీపీ వికాస్ కౌశిక్ చెప్పారు.

బాధితురాలిని గుర్తించేందుకు మృతురాలి ఫోటోను ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప‌రిధిలోని పోలీస్ స్టేష‌న్లు అన్నింటికీ పంపామ‌ని చెప్పారు.

Next Story