సీఐ డెత్ మిస్ట‌రీలో ట్విస్ట్‌.. బ‌ల్లి కార‌ణం గానే..

Guntur CI Sesharao death mystery.గుంటూరు రేంజ్‌కు చెందిన పోలీసు ఇన్‌స్పెక్ట‌ర్ కె.శేషారావు(45) డెత్ మిస్ట‌రీలో షాకింగ్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 March 2021 1:15 PM IST
సీఐ డెత్ మిస్ట‌రీలో ట్విస్ట్‌.. బ‌ల్లి కార‌ణం గానే..

గుంటూరు రేంజ్‌కు చెందిన పోలీసు ఇన్‌స్పెక్ట‌ర్ కె.శేషారావు(45) డెత్ మిస్ట‌రీలో షాకింగ్ నిజం బ‌య‌ట‌ప‌డింది. తొలుత సీఐది అనుమానాస్ప‌ద మృతిగా భావించారు. ఆత‌రువాత సీసీ టీవీ పుటేజ్ ప‌రిశీలించ‌గా అస‌లు నిజం వెలుగుచూసింది. ఆయ‌న ప్రాణం పోవ‌డానికి ఓ బ‌ల్లి కార‌ణం అని తేలింది. త‌న కుమారై మెడిక‌ల్ సీటు విష‌య‌మై మాట్లాడ‌డానికి గుంటూరు పండ‌రీపురంలో ఉన్న ఓ మ‌హిళ ఇంటికి ఆదివారం రాత్రి ఆయ‌న వెళ్లారు. రాత్రి 9 గంట‌ల స‌మ‌యంలో ఆ ఇంట్లో నిర్మాణంలో ఉన్న లిఫ్ట్ వ‌ద్ద ఓ బ‌ల్లి క‌నిపించ‌గా.. దాన్ని చీపురుతో త‌రిమే క్ర‌మంలో ప‌క్క‌కు ఒరిగి రెండో అంత‌స్తు నుంచి జారి కింద‌ప‌డ్డారు. సీసీ కెమెరాలో ఇదంతా రికార్డ్ అయ్యింది.


సీఐ భ‌వ‌నం పై నుంచి కింద‌కు ప‌డిపోగానే గుర్తించిన మ‌హిళ కుమారుడు వెంట‌నే ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు స‌మాచారం ఇచ్చారు. ఆయ‌న్ను ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా.. చికిత్స పొందుతూ సోమ‌వారం ఉద‌యం మృతి చెందారు. మృత‌దేహాన్ని గుంటూరు జీజీహెచ్‌కు త‌ర‌లించి పోస్టుమార్టం నిర్వ‌హించారు. భార్య మ‌ధుర‌వాణి ఫిర్యాదు మేర‌కు ప‌ట్టాభిపురం స్టేష‌న్‌లో కేసు న‌మోదు చేశారు. శేషారావుపై గతంలో కొన్ని ఫిర్యాదులు రావడంతో ప్రస్తుతం ఆయన నెల్లూరు ఎస్పీ కార్యాలయంలో వీఆర్‌లో ఉన్నారు. కొంతకాలంగా ఆయన మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది.




Next Story