సిద్దిపేట జిల్లాలో కాల్పుల కలకలం
Gun Firing in Siddipet District.సిద్దిపేట జిల్లాలో కాల్పుల కలకలం రేగింది. తొగుట మండలం రాంపూర్ శివారులో
By తోట వంశీ కుమార్ Published on
9 March 2022 1:35 PM GMT

సిద్దిపేట జిల్లాలో కాల్పుల కలకలం రేగింది. తొగుట మండలం రాంపూర్ శివారులో ఒగ్గు తిరుపతి, అతడి అనుచరులు.. ఆకుల వంశీపై కాల్పులు జరిపారు. భూ వివాదం నేపథ్యంలోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. వంశీ గతంలో తిరుపతిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. తిరుపతి పై కత్తితో దాడి చేసినట్లు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన కేసు దుబ్బాక కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో వంశీ కోర్టుకు హాజరై తిరిగి వెలుతున్న క్రమంలో రాంపూర్ శివారులో అతడిపై కాల్పులకు పాల్పడ్డారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. వివరాలు సేకరిస్తున్నారు. కాగా.. తిరుపతి, వంశీలు సమీప బంధువులేనని, పాత కక్షలు, భూ వివాదాల నేపథ్యంలోనే కాల్పుల ఘటన జరిగినట్లుగా పోలీసులు బావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తిరుపతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
Next Story