ప‌ల్నాడు జిల్లాలో కాల్పుల క‌ల‌క‌లం.. టీడీపీ నేత‌పై హ‌త్యాయ‌త్నం

Gun Fire in Palnadu District.ప‌ల్నాడు జిల్లాలోని రొంపిచ‌ర్ల మండ‌లంలో కాల్పుల క‌ల‌క‌లం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Feb 2023 9:55 AM IST
ప‌ల్నాడు జిల్లాలో కాల్పుల క‌ల‌క‌లం.. టీడీపీ నేత‌పై హ‌త్యాయ‌త్నం

ప‌ల్నాడు జిల్లాలోని రొంపిచ‌ర్ల మండ‌లంలో కాల్పుల క‌ల‌క‌లం రేగింది. అల‌వాల‌లో తెలుగు దేశం పార్టీ నేత‌పై దుండ‌గులు కాల్పులు జ‌రిపారు. రొంపిచెర్ల మండ‌ల టీడీపీ అధ్య‌క్షుడు, మాజీ ఎంపీపీ వెన్నా బాల‌కోటి రెడ్డి ఇంట్లోకి ప్ర‌వేశించిన దుండ‌గులు ఆయ‌న‌పై రెండు రౌండ్లు కాల్పులు జ‌రిపారు. ఈ ఘ‌ట‌న‌లో బాల‌కోటి రెడ్డి తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. కుటుంబ స‌భ్యులు వెంట‌నే ఆయ‌న్ను న‌ర్స‌రావుపేట‌ ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.

స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. అక్క‌డ ప‌రిస్థితిని ప‌రిశీలించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. దుండ‌గుల కోసం గాలింపు చేప‌ట్టారు. ప్రత్యర్థులే బాలకోటిరెడ్డిపై కాల్పులకు పాల్ప‌డిన‌ట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

కాగా.. కొద్ది నెల‌ల క్రితం అంటే గ‌తేడాది జులై నెల‌లో ఉద‌యం వాకింగ్‌కు వెళ్లిన బాల‌కోటిరెడ్డి పై క‌త్తుల‌తో దాడి చేశారు. ఈ ఘ‌ట‌న‌లో తీవ్రంగా గాయ‌ప‌డిన బాల‌కోటి రెడ్డి చికిత్స అనంత‌రం కోలుకున్నారు. ఈ ఘ‌ట‌న‌ను మ‌రువక ముందే మ‌రోసారి బాల‌కోటిరెడ్డి కాల్పులు జ‌ర‌గ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

Next Story