గుజరాత్లో సోమవారం ఓ వ్యక్తి చేసిన చిలిపి పనికి.. మరో వ్యక్తి ప్రాణం పోయింది. బంధువు ప్రైవేట్ పార్ట్‌లలో కంప్రెసర్ పైపును అమర్చడంతో బాధితుడు వాంతులు చేసుకున్నాడు.. ఆ తర్వాత అతడు మరణించినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడు ప్రకాష్ తన సోదరుడు ఘేవాభాయ్, అతని స్నేహితులు కడిలోని ఒక మెటల్ కంపెనీలో ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది. సాయంత్రం ప్రకాష్‌పై బంధువు అల్పేష్ చిలిపి చేష్టలకు పాల్పడ్డాడు. ప్రకాష్ ప్రైవేట్ భాగాల్లో కంప్రెసర్ పైపును చొప్పించి గాలి కొట్టాడు. దీని కారణంగా బాధితుడి శరీరం గాలితో నిండి ఉందని పోలీసులు తెలిపారు.
దీంతో ప్రకాష్ వాంతులు చేసుకుని స్పృహ తప్పి పడిపోయాడు. అతన్ని సమీప ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాని తరువాత అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి తరలించారు, అక్కడ అతను చనిపోయినట్లు ప్రకటించారు. ఆదివారం గణతంత్ర దినోత్సవం రోజున తన కంపెనీ మూసివేయడంతో ప్రకాష్ తన సోదరుడు, అతని బంధువును ఆల్పేష్ కలిసేందుకు వెళ్లారని పోలీసులు తెలిపారు.
ప్రకాష్ సోదరుడు ఘేవాభాయ్ తెలిపిన వివరాల ప్రకారం.. కంప్రెసర్ పైపులో గాలి పీడనం ఎక్కువగా ఉందని అల్పేష్‌కు తెలుసునని, అయినప్పటికీ, అతను దానిని బాధితుడి ప్రైవేట్ భాగాలలోకి చొప్పించాడు, దాని ఫలితంగా అతను మరణించాడు. ఘేవాభాయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వినోదం కోసం ఈ ఘటన విషాదంగా మారిందని వారు తెలిపారు.