తొలి రాత్రి నుంచి భ‌ర్త విచిత్ర ప్ర‌వ‌ర్త‌న‌.. ఈ వయసులో కోరికలు ఉండకూడదు

Groom Strange Behavior on the First Night.అతనో ప్రభుత్వ ఉద్యోగి.. అమ్మాయిని బాగా చూసుకుంటాడని అతనికి ఇచ్చి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 July 2021 7:15 PM IST
తొలి రాత్రి నుంచి భ‌ర్త విచిత్ర ప్ర‌వ‌ర్త‌న‌.. ఈ వయసులో కోరికలు ఉండకూడదు

అతనో ప్రభుత్వ ఉద్యోగి.. అమ్మాయిని బాగా చూసుకుంటాడని అతనికి ఇచ్చి ఘనంగా వివాహం చేశారు పెద్దలు. ఎన్నో ఆశ‌ల‌తో ఆ యువ‌తి తొలిరేయి గ‌దిలోకి అడుగుపెట్టింది. అయితే.. భ‌ర్త విచిత్ర ప్ర‌వ‌ర్త‌న‌తో విస్తుపోయింది. దీంతో త‌న జీవితాన్ని నాశ‌నం చేశారని.. అత్తింటి కుటుంబంపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని బాధిత యువ‌తి పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసింది. గుంటూరు జిల్లా నరసరావుపేటలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

బాధితురాలు బంధువులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. తాడేపల్లిలోని గ‌వ‌ర్న‌మెంట్ కార్యాల‌యంలో పనిచేస్తున్న ఓ మహిళ తన కుమారుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అని నమ్మించి గుంటూరుకు చెందిన యువతితో సంబంధం కుదుర్చుకుంది. మే 26న వివాహం జరిగింది. కట్నంగా రూ.6లక్ష‌ల‌తో పాటు పెళ్లికి మ‌రో రూ.2ల‌క్ష‌లు తీసుకుంది. అంతేకాదు.. తన కుమారుడి తొలిరాత్రి భువనేశ్వర్‌లో జరగాలని ఒత్తిడి చేసింది. అందుకు యువతి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. తొలిరాత్రిని నర్సరావుపేటలో ఏర్పాటు చేశారు. తొలిరాత్రి రోజు యువకుడు వింత ప్రవర్తనలతో ఆ యువతి నిశ్చేష్టురాలైంది

ఈ వయసులో కోరికలు ఉండకూడదని ఆమెకు హితవు పలికి మాత్ర వేసుకుని నిద్రపోయాడు. ఇలా మూడు రోజులు జరిగింది. చివరి రోజు మాత్రలు అయిపోయాయి. ఆ యువతి వద్దకు వెళ్లి.. మాత్రలు వేసుకోకపోతే తలనొప్పి, నోటివెంట సొంగ పడుతుందన్నాడు. తనకు ఆరోగ్యం బాగోలేదని, మానసిక స్థితి సరిగాలేదంటూ తెలపడంతో విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు తెలిపింది. వాళ్లు వచ్చి అత్తను ప్రశ్నిస్తే తన కుమారుడు ఆరోగ్యవంతుడేనని, తలనొప్పికి మాత్రలు వేసుకుంటున్నాడు.. కావాలంటే జీజీహెచ్‌ డాక్టర్ ను సంప్రదించాలని తెలిపింది. బాధితురాలు వైద్యుడితో మాట్లాడ‌గా మ‌రిన్ని షాకింగ్ విష‌యాలు తెలిసాయి. అతడి మానసిక స్థితి సరిగా లేదని, మాత్రలు వాడకపోతే ప్రమాదమని చెప్పారు.

ఈ విషయాలన్నీ దాచిపెట్టి పెళ్లి చేశారని, అడిగితే బెదిరిస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నరసరావుపేట పోలీసులకు ఫోన్ చేస్తే అత్తింటి వారికి ఉన్న పరిచయాలతో కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని బాధిత యువతి ఆరోపించింది. మోసగించి సంసారానికి పనికిరాని వ్యక్తితో పెళ్లి చేసినందుకు అత్త, భర్తతోపాటు పెళ్లి కుదిర్చిన మధ్యవర్తిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story