బాలికకు దెయ్యం పట్టిందని నమ్మించి.. ఆరు నెలలుగా..

దేశంలో ఏదో మూలన మూఢనమ్మకాల సంఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.

By Srikanth Gundamalla  Published on  5 Jun 2024 8:04 AM IST
girl,  rape, karnataka, crime,

 బాలికకు దెయ్యం పట్టిందని నమ్మించి.. ఆరు నెలలుగా..

దేశంలో ఏదో మూలన మూఢనమ్మకాల సంఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా మైనర్ బాలికకు దెయ్యం పట్టిందని నమ్మించిన ఓ మతగురువు దారుణానికి పాల్పడ్డాడు. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా ఆరు నెలల పాటు బాలికపై అత్యాచారం చేస్తూ వచ్చాడు. శృంగారంతోనే దెయ్యం వీడుతుందని నమ్మించి.. అమ్మాయిపై రాక్షసుడిలా అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరకు ఈ విషయం ఆలస్యంగా తల్లిదండ్రులకు తెలిసింది. అతని నేరాన్ని పోలీసులకు చెప్పారు.

కర్ణాటకలో జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది. ఉత్తర్‌ ప్రదేశ్‌కు చెందిన ఓ మతగురువు చిత్రదుర్గలో ఉన్న ఒక మసీదులో ఉంటున్నాడు. అతని వద్దకు ఒక మైనర్‌ బాలిక గత మూడేళ్లుగా ఖురాన్ అధ్యయానాలకు హాజరువుతూ వచ్చింది. ఒక రోజు ఆ బాలిక తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఆ విషయం తెలుసుకున్న మతగురువు ఆమె ఇంటికి వెళ్లి చూశాడు. తనకు తెలిసిన చికిత్సను అందించాడు. అప్పుడే మతగురు ఆలోచన మారింది. అమ్మాయి పట్ల దుర్బుద్ధిని పెంచుకున్నాడు. అప్పటి వరకు బాలిక పట్ల బాగానే ఉన్నా.. ఒక్కసారిగా కామవాంఛ పెంచుకున్నాడు.

బాలికకు దెయ్యం పట్టిందనీ.. శృంగారం వల్లే అది నయం అవుతుందని బాలిక సోదరుడిని నమ్మించాడు. ఆ తర్వాత లైంగిక వేధింపులక పాల్పడేలా సోదరుడిని ప్రేరేపించాడు. ఆపై తతంగాన్ని ఫోన్‌లో రికార్డు చేశాడు. ఆ తర్వాత మతగురువు కూడా బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. యువతికి ఇష్టం లేదని చెప్పినా వినలేదు. బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. వారానికి ఒకసారి.. అలా ఆరు నెలల పాటు బాలికను వేధించాడు. ఓ రోజు బాలికకు తీవ్ర కడుపునొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పుడే మతగురు చేసిన పని వెలుగులోకి వచ్చింది. బాలిక తన తల్లిదండ్రులకు జరిగిందంతా చెప్పింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మతగురువుని అరెస్ట్ చేశారు.

Next Story