బాయ్ ఫ్రెండ్ చేతిలో మోసపోయిన మహిళ.. ఆ తర్వాత ఏమి చేసిందంటే

Girl took this big step after being cheated by lover.బీహార్ రాజధాని పాట్నాలో ఒక మహిళని ఆమె ప్రియుడు మోసగించి

By M.S.R  Published on  8 March 2022 9:08 PM IST
బాయ్ ఫ్రెండ్ చేతిలో మోసపోయిన మహిళ.. ఆ తర్వాత ఏమి చేసిందంటే

బీహార్ రాజధాని పాట్నాలో ఒక మహిళని ఆమె ప్రియుడు మోసగించి విడిచిపెట్టాడు. దీంతో ఆమె కాల్ గర్ల్ రాకెట్‌ను నడపడం ప్రారంభించి.. ఏకంగా గ్యాంగ్ ను నడపడం మొదలుపెట్టింది. పాట్నాలోని వీవీఐపీ ఏరియాల్లోని పలు అపార్ట్‌మెంట్లలో సెక్స్ రాకెట్ నడుస్తున్నట్లు పెద్ద ఎత్తున వివరాలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం పలు రహస్యాలను బయటకు లాగడానికి కాల్ గర్ల్ రాకెట్ నిర్వాహకులని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రెండేళ్ల క్రితమే ఈ రాకెట్ నిర్వాహకురాలి ప్రియుడు ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నాడు. అప్పటికే రెండేళ్ల క్రితం పెళ్లయిన ఆ మహిళ భర్త, పిల్లలను వదిలి ప్రియుడితో కలిసి జీవించడం ప్రారంభించింది. తమ మధ్య ఒక్కసారిగా మనస్పర్థలు రావడం.. ప్రియుడితో విడిపోవడంతో కాల్ గర్ల్ రాకెట్ నిర్వాహకురాలిగా మారింది. ప్రియుడు మోసం చేశాడని పోలీసులతో చెప్పింది. పాట్నా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొదట్లో బాగా డబ్బు సంపాదించేది. బీహార్‌లో మద్య నిషేధం విధించబడినప్పుడు కస్టమర్లు తగ్గడం ప్రారంభించారు. ఆ తర్వాత ఇతర రాష్ట్రాల అమ్మాయిలను వ్యాపారంలోకి దింపడం ప్రారంభించింది. ఈ వ్యాపారంలో ఆమెకు మరో యువతి మద్దతు లభించింది, ఆమె కూడా కాల్ గర్ల్ అని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఇద్దరు కూడా నలందకు చెందిన ఓ మహిళ ముఠాలో చేరి బాలికలను ట్రాప్ చేసి పాట్నాకు తీసుకురావడం ప్రారంభించారు. ఈ రాకెట్‌లో ఒకరిని అరెస్టు చేయగా, మరొకరి కోసం గాలిస్తున్నారు. ఈ షాకింగ్ ఘటనలో ధనంజయ్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కస్టమర్లను తీసుకురావడం అతని పని. సెక్రటేరియట్ ఏఎస్పీ కామ్య మిశ్రా నుంచి అందిన సమాచారం ప్రకారం.. గత నెల రోజులుగా వ్యభిచార నిర్వాహకుల చెరలో ఉన్నట్టు బాలికలు విచారణలో తెలిపారు.

Next Story