పెంపుడు పిల్లి మరణం తట్టుకోలేక యువ‌తి ఆత్మహత్య

మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెంపుడు జంతువు మరణాన్ని తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది.

By -  Medi Samrat
Published on : 19 March 2026 7:28 PM IST

పెంపుడు పిల్లి మరణం తట్టుకోలేక యువ‌తి ఆత్మహత్య

మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెంపుడు జంతువు మరణాన్ని తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. బడంగ్‌పేట్ చెందిన హిమబిందు(20) బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతోంది. గత రెండు సంవత్సరాలుగా ఆమె ఎంతో ఇష్టంగా పెంచుకున్న పెంపుడు పిల్లి ఇటీవల మరణించింది. ఈ నేపథ్యంలో హిమబిందు ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఈనెల 18న (బుధవారం) ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలిసిన వెంటనే మీర్‌పేట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Next Story