Crime: తోటి విద్యార్థిని బాత్రూంలో స్నానం చేస్తూండగా వీడియో తీసింది
కర్ణాటకలోని బెంగళూరులో ఉన్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)లో చదువుతున్న విద్యార్థినిని పోలీసులు
By అంజి Published on 3 April 2023 3:04 AM GMTCrime: తోటి విద్యార్థిని బాత్రూంలో స్నానం చేస్తూ వీడియో తీసింది
కర్ణాటకలోని బెంగళూరులో ఉన్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)లో చదువుతున్న విద్యార్థినిని పోలీసులు అరెస్టు చేశారు. తన బ్యాచ్‌కు చెందిన మరో విద్యార్థిని స్నానం చేస్తున్న దృశ్యాన్ని వీడియో తీసినందుకు ఆమెపై ఆరోపణలు వచ్చాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. అదే సమయంలో కేంద్రం కూడా బాలికను సస్పెండ్ చేసింది. సమాచారం ప్రకారం.. ఈ సంఘటన మార్చి 29 న జరిగింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) బెంగళూరు సెంటర్‌లో స్పోర్ట్స్ కోచింగ్‌లో డిప్లొమా చదువుతున్నట్లు బాధితురాలు తన నివేదికలో రాసింది.
ప్రాక్టీస్ తర్వాత క్యాంపస్‌లోని బాత్‌రూమ్‌లో స్నానం చేయడానికి వెళ్లానని ఆమె చెప్పింది. ఆమెతో పాటే చదువుతున్న మరో బాలిక స్నానం చేస్తున్న వీడియోను తన మొబైల్‌లో రికార్డ్ చేసింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. వీడియో గురించి తోటి విద్యార్థినితో గొడవ పడడంతో ఆమె పారిపోయింది. దీంతో వెంటనే ఈ విషయాన్ని కేంద్రం అధికారులకు తెలియజేసింది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో వెంటనే చర్యలు తీసుకున్న పోలీసులు కేంద్రం అధికారులను సంప్రదించి మరింత సమాచారం రాబట్టారు. అనంతరం నిందితురాలైన విద్యార్థిని అరెస్టు చేశారు. దీంతో పాటు ఆమెను కేంద్రం నుంచి సస్పెండ్ చేశారు.
సాయ్ 1984లో స్థాపించబడింది
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) 1984లో స్థాపించబడింది. సాయ్ క్రీడలను ప్రోత్సహించడం, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో క్రీడా నైపుణ్యాన్ని సాధించడం అనే జంట లక్ష్యంతో ప్రారంభించబడింది. దేశంలో సాయికి 10 ప్రాంతీయ కేంద్రాలు ఉన్నాయి. ఇవి కోల్‌కతా, బెంగళూరు, గాంధీనగర్, భోపాల్, సోనిపట్, చండీగఢ్, ఇంఫాల్, లక్నో, గౌహతి, ముంబైలలో ఉన్నాయి. ఇది కాకుండా సాయ్ ఎక్సలెన్స్ సెంటర్లు కూడా ఉన్నాయి.